Begin typing your search above and press return to search.
దేశవ్యాప్తంగా పోలీసులకు ఒకే యూనిఫాం.. కేంద్రం దూకుడు!
By: Tupaki Desk | 28 Oct 2022 3:30 PM GMTరాష్ట్రాల అధికారాలకు ఇప్పటికే కత్తెర వేస్తున్న కేంద్రం.. ఇప్పుడు రాష్ట్రాల పరిధిలో ఉన్న కీలకమైన శాంతి భద్రత విషయాన్ని కూడా తన చెప్పు చేతల్లోకి తీసుకునే ప్రయత్నాలు ప్రారంభించిందా? ఇప్పటి వరకు పోలీసుల విషయం రాష్ట్రాల జాబితాలో ఉండగా దానికి కూడా తన పరిధిలోకి మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందా? అత్యంత కీలకమైన రాష్ట్రాల హోం శాఖలపైనా కేంద్రం దృష్టి పెట్టిందా? అంటే.. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటన చూస్తే.. ఔననే అంటున్నారు పరిశీలకులు.
ఇప్పటికే వన్ నేషన్-వన్ రేషన్ పేరుతో నిత్యవసరాల పంపిణీపై కేంద్రం అజమాయిషీ చేస్తోంది. అదేవిధంగా ఆత్మనిర్భర్ పేరుతో విదేశీ వస్తువులను దిగుమతి చేసుకునే రాష్ట్రాలకు షాకిస్తోంది.
వన్ నేషన్-వన్ గ్రిడ్ పేరుతో విద్యుత్‌పైనా అధికారాలు కోసేసింది. ఇలా.. చాలా విషయాల్లో రాష్ట్రాల అధికారాన్ని తన ఖాతాలో వేసుకుంటున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు..తాజాగా కేవలం ఇప్పటి వరకు రాష్ట్రాలకే పరిమితమైన పోలీసుల వ్యవహారంలోకి నెమ్మది నెమ్మదిగా అడుగులు వేస్తోంది.
ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా దేశంలోని పోలీసులందరికీ ఒకే యూనిఫాం ఉండాలనే ప్రతిపాదన చేశారు. హరియాణాలోని సూరజ్కుండ్లో జరుగుతున్న రాష్ట్ర హోంమంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఒకే యూనిఫాం అనేది సూచన మాత్రమేనని.. దానిని రాష్ట్రాలపై రుద్దే ప్రయత్నం చేయట్లేదని ఆయన చెప్పినా.. దీనిని తొలి అడుగుగా భావించాల్సి ఉంటుందని మేధావులు చెబుతున్నారు. గతంలో వన్ రేషన్ విషయంలోనూ ఇలానే నమ్మించారని అంటున్నారు. నేరాలను నియంత్రించేందుకు, నేరస్థులను పట్టుకునేందుకు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం ఉండాలని మోడీ తెలిపారు.
దేశ అంతర్గత భద్రత కోసం రాష్ట్రాలతో కలిసి పనిచేయడం కేంద్రం బాధ్యత అని ప్రధాని మోడీ అభిప్రాయపడడం వెనుక ఖచ్చితంగా రాష్ట్రాల శాంతి భద్రతల విషయంలోనూ కేంద్రం ఇక వేలు పెట్టడం ఖాయంగా కనిపిస్తోందని మేదావులు చెబుతున్నారు. వాస్తవానికి రాజ్యాంగం ప్రకారం శాంతిభద్రతలు రాష్ట్రానికి సంబంధించినవి అయినప్పటికీ.. అవి దేశ ఐక్యత, సమగ్రతతో ముడిపడి ఉంటాయని ప్రధాని తెలపడం.. దీనికి నిదర్శనంగా భావిస్తున్నారు.
'ఒకే దేశం ఒకే యూనిఫాం' అనేది కేవలం ఒక ఆలోచన. నేను దానిని మీపై రుద్దే ప్రయత్నం చేయట్లేదు. ఇది 5 నుంచి 100 ఏళ్లలో ఎప్పుడైనా జరగవచ్చు. ఒక్కసారి ఆలోచించండి. దేశవ్యాప్తంగా ఉన్న పోలీసులకు ఒకే యూనిఫాం ఉండాలని నేను భావిస్తున్నా.
పాత చట్టాలను సవరించాలి.. వాటిని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయాలి. పోలీసులు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పరస్పరం సహకరించుకుని పనిచేయాలి`` అని ప్రధాని సూచించారు. మరి దీనిపై రాష్ట్రాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.