Begin typing your search above and press return to search.

మోడీ కొత్త విమానం.. అదిరిపోయే ఫీచర్స్

By:  Tupaki Desk   |   10 Oct 2019 6:51 AM GMT
మోడీ కొత్త విమానం.. అదిరిపోయే ఫీచర్స్
X
భారతదేశ ప్రధాని నరేంద్రమోడీ భద్రత మరింత కట్టుదిట్టం కానుంది. మోడీ పర్యటనల కోసం అత్యాధునిక టెక్నాలజీ కలిగిన మిస్సైల్ వ్యవస్థ ఉన్న బోయింగ్ బీ777 విమానాలను భారత్ కొనుగోలు చేస్తోంది. మోడీతోపాటు ఇతర వీవీఐపీల కోసం రెండు బోయింగ్ బీ777లను భారత్ ఆర్డర్ ఇచ్చింది. వచ్చే ఏడాది జూలై నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయి.

ఇన్నాల్లు మోడీ పర్యటనలో ఆయన వాడే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వన్ బీ747 విమానాలను ఎయిరిండియా పైలెట్లు నడిపేవారు. ఇప్పుడా బాధ్యతను ఎయిర్ ఫోర్స్ పైలెట్లకు అప్పగించారు. ఈ కొత్త బీ777 విమానాల మెయింటెనెన్స్ ను కూడా ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ కు కట్టబెట్టారు.

అమెరికాలోని ప్రపంచ ప్రసిద్ధ బోయింగ్ సంస్థ భారత ప్రధాని సహా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇతర వీఐపీల కోసం ఈ రెండు బీ777 విమానాలను తయారు చేస్తోంది. ఈ విమానంలో మిస్సైల్ వ్యవస్థ ఉంది. రెండు డిఫెన్స్ వ్యవస్థలను 190 మిలియన్ డాలర్లకు భారత్ కు అమ్మేందుకు అమెరికా ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగానే బీ777 విమానాన్ని అత్యాధునిక టెక్నాలజీతో బోయింగ్ సంస్థ తయారు చేసి భారత్ కు ఇస్తోంది.

ఇక నుంచి భారత ప్రధాని మోడీతోపాటు వీవీఐపీలు ప్రయాణించే ఈ కొత్త విమానాన్ని క్షిపణులు పేల్చినా తప్పించుకునేలా గట్టి భద్రతతో రూపొందించారు. ఎదురుదాడి చేయగల సామర్థం ఈ విమానం సొంతం.. ఇప్పటికే ఈ బీ777 విమానాన్ని నడిపేందుకు ఆరుగురు ఎయిర్ ఫోర్స్ పైలెట్లకు శిక్షణ కూడా ఇప్పించారు. సో ప్రధాని మోడీకి మరో శక్తివంతమైన విమానం రక్షణగా వస్తోందన్న మాట.