Begin typing your search above and press return to search.
'రాజన్న రాజ్యం' లో రైతన్న ఆత్మహత్యలు.. : మోడీనే చెప్పారు
By: Tupaki Desk | 10 Dec 2022 5:30 AM GMTతెల్లారి లేస్తే.. తమది రాజన్న రాజ్యమని, రైతుల మేలుకోరుకునే పాలనని పదే పదే చెప్పే వైసీపీ ప్రభుత్వానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు భారీ షాక్ ఇచ్చింది. ఏపీలో రైతులకు మేలు జరగడం లేదని, అందుకే వారు ఆత్మహత్యల పాలవుతున్నారని కుండబద్దలు కొట్టింది. కేవలం గత మూడేళ్లలో అంటే 2019-21 మధ్య కాలంలో రాష్ట్రంలో 1673 మంది రైతులు తీవ్రనష్టాలు, కష్టాల పాలై..ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక.. బలవన్మరణాలకు పాల్పడ్డారని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
దేశంలో అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్న రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో అనేక రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టినా.. ఏపీతో పాటు మరో రెండు మూడు రాష్ట్రాల్లో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగాయని రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సమాధానమిచ్చారు.
వైసీపీ హయాంలో 2019లో 628 మంది, 2020లో 564 మంది, 2021లో 481 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తోమర్ వివరించారు. అంటే, మొత్తంగా ఈ మూడేళ్ల కాలంలో ఏపీలో 1,673 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. కర్ణాటక, మహారాష్ట్ర తర్వాత ఏపీలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. అనేక రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు తగ్గుతున్నా.. ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని తెలిపారు. 2017లో తెలంగాణాలో 846 మంది ఆత్మహత్యలు చేసుకోగా.. 2021 నాటికి 352కు రైతుల ఆత్మహత్యలు తగ్గాయని కేంద్ర మంత్ర తోమర్ తెలిపారు. ఇక, టీడీపీ హయాంలో 2017లో 375 మంది, 2018లో 365 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని వివరించారు.
మరిదీనిపై వైసీపీ నేతలుఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. దీనిని కూడా ఓర్చుకోలేక చంద్రబాబు చెప్పిస్తున్నారని.. విపక్షాలు కుట్ర చేస్తున్నాయని అనేసి.. మైకులు కట్టేస్తారా? చూడాలి ఏం జరుగుతుందో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.