Begin typing your search above and press return to search.
అందుకే అమ్మతో ఉండట్లేదంటున్న మోదీ
By: Tupaki Desk | 24 April 2019 9:25 AM GMTప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని 7 లోక్ కల్యాణ్ మార్గ్ లో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూ చేశారు. పూర్తిగా రాజకీయాలకు సంబంధం లేని అంశాలపై చర్చించిన ఈ ఇంటర్వ్యూలో ప్రధాని పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. తన జీవితం, తన కుటుంబ సంబంధాలు సహా ఇతర అనేక అంశాలపై ఆయన మాట్లాడారు. తాను ప్రధాని అవుతానని అసలు ఊహించనేలేదని అన్నారు. సైన్యంలో చేరి దేశసేవ చేయాలనుకున్నానని కానీ, అనుకోకుండా రాజకీయల్లోకి వచ్చానని వెల్లడించారు. తాను క్రమశిక్షణ గల కార్యకర్తనని కఠినంగా ఉంటాను తప్పించి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని మాత్రం అనుకోనని మోదీ వివరించారు.
తాను పనిచేస్తూ.. మిగతా వారందరితో పని చేయిస్తానని మోదీ వివరించారు. విపక్ష నేతల్లో చాలా మంది స్నేహితులు ఉన్నారు. కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ తనకు ఆప్తమిత్రుడని పేర్కొన్నారు. అందరితో సరదాగా గడపాలని భావిస్తానని మోదీ అన్నారు. రామకృష్ణ మిషన్ తనకు స్ఫూర్తి అని తెలిపారు. అక్కడ జరిగిన అభ్యాసంలో ఎలాంటి అనుబంధమైనా ఒక మిథ్య అని తెలియడంతో చాలా చిన్న వయసులోనే అన్ని బంధాలను వదిలేశానని మోదీ వివరించారు. చిన్న వయసు నుంచే ఇంటికి దూరంగా ఉండటం వల్ల...తన తల్లి, సోదరుడితో కలిసి ఉండటం లేదనే భావన తనకెప్పుడు కలగలేదని ఆయన వివరించారు. తన తల్లితో కలిసి ఉండకపోవడం గురించి వివరిస్తూ, ‘‘నీ ఇంట్లో నేనేమి చేయాలి? నీతో నేను ఏమి మాట్లాడాలి? అని నా తల్లి అడుగుతుంది`` అంటూ మోదీ వివరించారు. దీంతో పాటుగా రాత్రి పొద్దుపోయిన తర్వాత తాను ఇంటికి వస్తే ఆమె కలత చెందుతుందని మోదీ వెల్లడించారు. తన తల్లికి తానెప్పుడూ డబ్బులు పంపించనని, ఆమె తనకు డబ్బులు ఇస్తుందని మోదీ తెలిపారు. కలిసినప్పుడల్లా రూ.1.25 తన చేతిలో పెడుతుందని తెలిపారు.
తన తల్లికి దూరంగా ఉన్నంతమాత్రాన తనకు ఆమెతో సత్సంబంధాలు లేవని భావించద్దని మోదీ భావించారు. తన నుంచి తల్లి ఏదీ కోరుకోదని, తమ కుటుంబం కోసం ఒక్క రూపాయి ప్రభుత్వ ధనాన్ని సైతం ఉపయోగించడం లేదని మోదీ స్పష్టం చేశారు. తను దేశమే కుటుంబంగా భావిస్తానని, తన జీవితమంతా ఇదే భావనతో ఉన్నానని తెలిపారు. ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడూ వెళ్లి అమ్మను కలిసి వస్తానన్నారు. ప్రముఖుల బయోగ్రఫీలు చదవడం అంటే తనకు చాలా ఇష్టమని ఆయన తెలిపారు. సాయంత్రం వేళ ఆరుబయట ఒంటరిగా టీ తాగుతూ సరదాగా గడపడం అంటే ఇష్టమని వివరించారు.