Begin typing your search above and press return to search.
పోలింగ్ రోజున గుళ్ల ప్రోగ్రాం ఏంది మోడీ?
By: Tupaki Desk | 12 May 2018 3:42 AM GMTపోల్ మేనేజ్ మెంట్ మీద బాగా పట్టున్న రాజకీయ అధినేతల్లో ప్రధాని మోడీ ఒకరు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. ఆ రాష్ట్రంలో బీజేపీకి లబ్ధి చేకూరేలా చేయటంలో ఆయన అనుసరించే వ్యూహం ఆసక్తికరంగా ఉండటమే కాదు.. ఓటర్లను ప్రభావితం చేసేలా ఉండటం.. కీలకమైన పోలింగ్ వేళ ఓటు వేసే వారి మనసుల్ని ప్రభావితం చేసేలా ఉందని చెప్పక తప్పదు.
ఆ మధ్య జరిగిన గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల పోలింగ్ రోజున.. ఆయన గుళ్లకు వెళ్లే ప్రోగ్రాం పెట్టుకోవటం.. దీనిపై జరిగిన భారీ ప్రచారం దెబ్బకు గుజరాత్ ఓటర్లు చివరిక్షణంలో మనసు మార్చుకున్నట్లుగా కొందరు విశ్లేషిస్తారు. వ్యతిరేక గాలి వీసినట్లుగా వార్తలు వచ్చిన వేళ.. మోడీ గుళ్ల ప్రోగ్రాం ఓట్ల రూపంలో మారి.. గుజరాత్ పట్టు మిస్ కాకుండా చేసిందని చెబుతారు.
తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే.. ఆసక్తికరంగా ఉండటమే కాదు.. కీలకమైన పోలింగ్ వేళ.. ప్రధాని గుళ్ల సందర్శన ప్రోగ్రాం ఉంటుందేనన్న భావన కలగటం ఖాయం. అదెలానంటే..ఈ రోజు (శనివారం) కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ జరుగుతుంది. మరోవైపు.. ప్రధాని మోడీ నేపాల్ పర్యటనలో ఉన్నారు. తాజాగా ఆయన పర్యటన వెనుక మతలబు ఉందా? అన్న సందేహం వ్యక్తమయ్యేలా ఆయన టూర్ షెడ్యూల్ ఉండటం గమనార్హం.
రెండు రోజుల నేపాల్ పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన జనక్ పుర్ లోని జానకీ టెంపుల్ ను సందర్శించటం.. శనివారం షెడ్యూల్ లో భాగంగా ప్రఖ్యాత ముక్తినాథ్ పసుపతినాథ్ టెంపుల్ ను సందర్శించటం ఆసక్తికరంగా మారింది.
ఎందుకిలా అంటే.. కర్ణాటక ఎన్నికల్లో అత్యంత కీలకమైన లింగాయత్ ఓటర్లు శివుడిని పశుపతినాథుడి రూపంలో పూజిస్తారు. కీలకమైన పోలింగ్ వేళ మోడీ పశుపతినాథ్ టెంపుల్ సందర్శన చేపట్టటం.. ఓటర్లను అంతో ఇంతో ప్రభావితం చేసే వీలుందని.. మోడీ వర్గానికి పాజిటివ్ గా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కీలకమైన పోలింగ్ వేళ.. ప్రధాని మోడీ నేపాల్ పర్యటనకు అంతో ఇంతో లింకు ఉండే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.