Begin typing your search above and press return to search.
ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ ఫోన్ చేశారా? సారాంశం ఇదేనట!
By: Tupaki Desk | 7 May 2021 3:34 AM GMTసాయం కోరినోడు.. తాను ఫలానా సాయం అడిగానని చెప్పుకోవటానికి మొహమాటంగా ఉంటుంది. ఫలానా పెద్ద మనిషి ఫలానా సాయాన్ని అడిగారు.. మేం ఆ విషయాన్ని తక్షణమే పరిష్కరించామన్న సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్టు రూపంలో పెట్టుకోవటం తప్పేం కాదు. అలా చేయటం ద్వారా ట్వీట్ పిట్టకు కూసింత మేత వేసినట్లు ఉంటుంది కదా? మరెందుకో కానీ.. గతంలో మాదిరి అన్ని విషయాన్ని పంచుకోవటానికి ప్రధాని మోడీ సుముఖంగా ఉన్నట్లు కనిపించట్లేదు. సెకండ్ వేవ్ నేపథ్యంలో కేంద్రంలోని మోడీ సర్కారు వ్యవహరించిన తీరు.. వ్యాక్సినేషన్ విషయంలో అనుసరిస్తున్న పాలసీపై పెద్ద ఎత్తున విమర్శలు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.
వాతావరణం తనకు అనుకూలంగా లేదన్నప్పుడు మౌనంగా ఉండటం మోడీకి అలవాటే. అందుకు తగ్గట్లే.. ఆయన కామ్ గా ఉంటున్నారు. ఇటీవల తాను ప్రధాని మోడీకి ఫోన్ చేశానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. వ్యాక్సిన్ల కొరతతో పాటు.. ఆక్సిజన్ కు సంబంధించిన అంశాల్ని ప్రధాని మోడీతో ఫోన్లో మాట్లాడిన విషయాన్ని ఆయన వెల్లడించారు. రెమె డెసివర్ కోటాను పెంచాలని కోరగా.. అందుకు ఆయన ఓకే చెప్పినట్లుగా వెల్లడించారు.
తమిళనాడులోని పెరంబదూర్.. కర్ణాటకలోని బళ్లారి నుంచి రాష్ట్రానికి కేటాయించిన ఆక్సిజన్ అందటం లేదన్న విషయాన్ని ప్రధాని ముందుకు తీసుకెళ్లినట్లు చెప్పారు. ప్రస్తుతం రోజువారీ సరఫరాలో 440 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను 500 మెట్రిక్ టన్నులకు.. 4900 రెమ్ డెసివిర్ ఇంజక్షన్లను 25వేలకు పెంచాలని కోరానని.. రోజుకు 2.5లక్షల వ్యాక్సిన్ డోసుల అవసరం ఉందని చెప్పినట్లు చెప్పారు. తాను ప్రధాని మోడీకి ఫోన్ చేసి మాట్లాడిన వెంటనే.. కేంద్రమంత్రి పీయూష్ గోయిల్ కు ఆదేశాలు జారీ చేశారని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రధాని తనకు ఆదేశాలు జారీ చేసిన వైనాన్ని కేంద్రమంత్రి తనకు ఫోన్ చేసిన చెప్పారన్నారు.
మెరుగైన ఆక్సిజన్ సరఫరా కోసం ఒక్కొక్కటి రూ.కోటి చొప్పున పన్నెండు క్రయోజనిక్ ట్యాంకుల్ని చైనా నుంచి తెప్పిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. ఐఐసీటీ డైరెక్టర్ సూచనల మేరకు తక్షణమే 500 ఆక్సిజన్ ఎన్ రిచర్లను కొనుగోలు చేయాలని వైద్య శాఖ అధికారుల్ని ఆదేశించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న 9.5వేల ఆక్సిజన్ బెడ్లకు మరో ఐదు వేల ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేయాలని చెప్పానని చెప్పారు. మొత్తంగా.. వడివడిగా నిర్ణయాల్ని తీసుకుంటున్న విషయాన్ని కేసీఆర్ చెప్పకనే చెప్పేశారు.