Begin typing your search above and press return to search.

ఇస్రోలో మోదీ..జిమ్మిక్కేనంటున్న కుమారస్వామి

By:  Tupaki Desk   |   14 Sep 2019 1:30 AM GMT
ఇస్రోలో మోదీ..జిమ్మిక్కేనంటున్న కుమారస్వామి
X
జేడీఎస్ కీలక నేత - కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి... ప్రధాని నరేంద్ర మోదీపై తనదైన శైలి బాంబేశారు. చంద్రయాన్ 2 కీలక ఘట్టాన్ని వీక్షించేందుకు బెంగళూరులోని ఇస్రో కంట్రోల్ రూంకు మోదీ వస్తే... ఆ దినాన్ని సైంటిస్టుల పాలిట దుర్దినంగా కుమార అభివర్ణించారు. అంతటితో ఆగని కుమార... చంద్రయాన్2కు యూపీఏ సర్కారు నిధులిస్తే... చంద్రయాన్ 2 క్రెడిట్ ను మొత్తం తన ఖాతాలో వేసుకునేందుకే మోదీ ఇస్రో కంట్రోల్ రూంకు వచ్చారని - ఈ దిశగా మోదీ చేసిన తతంగమంతా ఓ రాజకీయ గిమ్మిక్కేనని కూడా కుమార తనదైన శైలి సెటైర్ వేశారు.

చంద్రయాన్ 2 అన్ని దశలను దాటుకుని చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ దిగుతున్న సందర్భంగా దానితో ఇస్రోకు సంకేతాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. చంద్రుడిపై ల్యాండర్ దిగే అరుదైన ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు ప్రధాని మోదీ బెంగళూరులోని ఇస్రో కంట్రోల్ రూంకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే చంద్రుడిపై దిగే సందర్భంగా ల్యాండర్ తో కమ్యూనికేషన్ కట్ కావడంతో ఈ ప్రయోగం విఫలమైనదిగా తేలింది. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురై వెక్కి వెక్కి ఏడ్చిన ఇస్రో చైర్మన్ శివన్ ను ప్రధాని తన గుండెలకు హత్తకుని మరీ ఓదార్చారు. ఈ దృశ్యాలు వైరల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే కదా.

ఆ సన్నివేశాలను మరోమారు గుర్తు చేసిన కుమారస్వామి... ఇస్రో కంట్రోల్ రూంలో మోదీ పాదం మోపడమే శాస్త్రవేత్తలకు దుర్దినంగా మారిందని తనదైన శైలి బాంబు పేల్చారు. ఇస్రో కంట్రోల్ రూంలో మోదీ పాదం మోపడమే చంద్రయాన్ 2 విఫలమైనట్లుగా కుమార చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెర వైరల్ గా మారిపోయాయి. అయినా 2008-09లో చంద్రయాన్ 2 కోసం యూపీఏ సర్కారు నిధులు విడుదల చేస్తే... పదేళ్ల పాటు శాస్త్రవేత్తలు కష్టపడితే.. మోదీ ఇస్రో కేంద్రంలో కాలుమోపి వారి శ్రమ బూడిదలో పోసిన పన్నీరులా మార్చారని కుమార ఆరోపించారు. ఇస్రోలో మోదీ ఎంట్రీకి - చంద్రయాన్ 2 విఫలమవడానికి లింకెట్టేసి కుమార చేసిన వ్యాఖ్యలు నిజంగానే కలకలం రేపుతున్నాయి.