Begin typing your search above and press return to search.
అల్లుడుగారికి జైలు తప్పదని చెప్పేసిన మోడీ!
By: Tupaki Desk | 8 May 2019 11:39 AM GMTగతానికి భిన్నంగా తాజా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఐదేళ్ల పదవీ కాలంలో తాను చేయని పనుల్ని.. తాజాగా తన చేతికి అధికారం వస్తే చేసేస్తానని స్పష్టం చేస్తున్నారు ప్రధాని మోడీ. తాము పవర్లోకి వస్తే.. తమ చేతికి అధికారం వచ్చిన ఏడాది వ్యవధిలోనే రైతులను లూటీ చేసిన షెహన్ షాను అరెస్ట్ చేసి.. జైల్లో పెట్టటం ఖాయమన్నారు.
తాజాగా హర్యానాలోని ఫతేబాద్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన మోడీ.. రాబర్ట్ వాద్రాను ఉద్దేశించి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చేశారు. హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా.. తక్కువ ధరలకు రైతుల నుంచి భూములు లాక్కుంటుందని.. రైతుల్ని లూటీ చేసిన వారిని ప్రజల ఆశీస్సులతో ఈ చౌకీదార్ కోర్టుకు ఈడ్చనున్నట్లు చెప్పారు.
వాళ్లు బెయిల్ మీద తిరుగుతున్నారు. ఈడీ ఆఫీసుల చుట్టూ ప్రదిక్షణాలు చేస్తున్నారు. తమను ఎవరూ టచ్ చేయలేరని భావిస్తున్నారని.. అలాంటి వారికి ఇప్పుడు వణుకు పట్టుకుందన్నారు. తాను దాదాపు జైలు గుమ్మం వరకు తీసుకెళ్లినట్లుగా చెప్పారు.
ప్రజలు కానీ ఆశీస్సులు ఇస్తే.. రాబోయే ఐదేళ్ల పదవీ కాలంలో జైల్లో పట్టిస్తానని చెప్పారు. దేశాన్ని దోచుకున్న వారి నుంచి సొమ్ము కక్కిస్తానని చెప్పారు.యూపీఏ హయాంలో రైతుల భూముల్ని పెద్ద ఎత్తున రాబర్ట్ వాద్రా అండ్ కో సొంతం చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తన ఐదేళ్ల పదవీ కాలంలో ఈ వ్యవహారం పెద్ద పురోగతి సాధించకున్నా.. మళ్లీ పవర్లోకి వస్తే మాత్రం.. జైలు పక్కా అని ఎన్నికల ప్రచార సభలో మోడీ మండిపడటం చూస్తుంటే.. మోడీ రెండో టర్మ్ సంచలనాలతో నిండి ఉండటం ఖాయమన్న భావన కలగటం ఖాయం.