Begin typing your search above and press return to search.

మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ పోల్‌ లో రాహుల్ కి తప్పని నిరాశ !

By:  Tupaki Desk   |   24 Jan 2020 6:25 AM GMT
మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ పోల్‌ లో రాహుల్ కి తప్పని నిరాశ !
X
దేశ ప్రధాని మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత పలు విప్లవాత్మకమైన నిర్ణయాలతో అందరిని ఆశ్చర్యపరుస్తూ పాలన కొనసాగిస్తున్నారు. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకి మరింత గా దిగజారుతోంది. గత ఎన్నికలలో మినిమం సీట్లని కూడా గెలుచుకుపోలేకపోయింది. ఆ తరువాత రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి సైతం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ నేపథ్యం లో ఇండియా టుడే గ్రూప్‌-కార్వీ ఇన్‌సైట్స్‌ మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ ఒక సర్వే చేపట్టింది. ఆ సర్వే దేనికోసం అంటే .. వచ్చే సీజన్ లో ప్రధానిగా దేశ ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారని చేయగా ..కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీతో పోలిస్తే తదుపరి ప్రధానిగానూ నరేంద్ర మోదీవైపే అత్యధికులు మొగ్గుచూపినట్టు ఈ సంస్థ వెల్లడించింది.

ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్‌ గాంధీల్లో ప్రధానిగా ఎవరిని ఎంచుకుంటారనేదానిపై ప్రజామోదంలో ఇద్దరికి 40 శాతం వ్యత్యాసం ఉండటం గమనార్హం. తదుపరి ప్రధానిగా 53 శాతం మంది నరేంద్ర మోదీని కోరుకుంటుండగా , ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని ముందుకు నడిపించడానికి రాహుల్‌ గాంధీయే సరైన నాయకుడని కేవలం 13 శాతం మంది మాత్రమే కోరుకుంటున్నట్టు వెల్లడించారు. ఇక కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ తదుపరి ప్రధాని గా ఉండాలని 7 శాతం మంది అభిప్రాయపడ్డారు. అలాగే ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ని దేశ ప్రధానిగా చూడాలని కేవలం 4 శాతం మంది ఆకాంక్షించారు. నరేంద్ర మోదీకి అసలైన ప్రత్యామ్నాయం ప్రియాంక గాంధీయేనని 3 శాతం మంది ఆమెకి పట్టం కట్టారు.

ఇక మరోవైపు 60 శాతం మంది హిందువులు, 17 శాతం మంది ముస్లింలు నరేంద్ర మోదీ మూడోసారి దేశ ప్రధాని బాధ్యతలు చేపట్టాలని కోరుకుంటుండగా , రాహుల్‌ గాంధీ ని ప్రధానిగా చూడాలని 10 శాతం హిందువులు, 32 శాతం మంది ముస్లింలు కోరుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని పశ్చిమ భారతం లో 66 శాతం మంది అక్కున చేర్చుకోగా, రాహుల్‌ వైపు కేవలం ఆరు శాతం మందే మొగ్గు చూపడం విశేషం. 19 రాష్ట్రాల్లోని 97 పార్లమెంట్‌ నియోజక వర్గాల పరిధి లోని 194 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12,141 మందిని స్వయం గా కలిసి ఈ సర్వే నిర్వహించి మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ పోల్‌ ను ఇండియా టుడే గ్రూప్‌- కార్వీ ఇన్‌సైట్స్‌ నిర్వహించాయి.