Begin typing your search above and press return to search.

మోడీ భజనలో వెంకయ్య పీక్స్

By:  Tupaki Desk   |   19 March 2016 5:00 AM GMT
మోడీ భజనలో వెంకయ్య పీక్స్
X
అసలే మాటకారి. అందులోనూ పొగిడేయాలని డిసైడ్ అయితే వ్యవహారం ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం కేంద్రమంత్రిగా వ్యవహరిస్తున్న వెంకయ్యనాయుడి రాజ్యసభ సభ్యత్వం మరికొద్ది రోజుల్లో పూర్తి కానుంది. పార్టీ సంప్రదాయం ప్రకారం.. నిబంధనల ప్రకారం.. మరోసారి రాజ్యసభ సభ్యత్వాన్ని పొడిగించే అవకాశం లేదు. ఒకవేళ అలాంటిదే చేయాలంటే.. ఇందుకోసం ప్రత్యేకంగా రూల్స్ ను మార్చాల్సిన అవసరం ఉంది. అలాంటిది ఏం జరగాలన్నా.. మోడీ దయ ఉండాల్సిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా ఒక కార్యక్రమానికి హాజరైన వెంకయ్యనాయుడు.. ప్రధాని మోడీని ఓ రేంజ్ లో పొగిడేశారు. పనిలోపనిగా తనకు బ్యాక్ బోన్ గా ఉండే ఆర్ ఎస్ ఎస్ ను ఎలాంటి మొహమాటం లేకుండా ప్రస్తావించిన ఆయన.. సంఘ్ వల్లనే తానీ స్థానానికి చేరుకున్న అసలు విషయాన్ని చెప్పేశారు. ఇక.. మోడీ భారతదేశానికి దిక్సూచీ లాంటి వ్యక్తి అని చెప్పిన మోడీ పేరును ఇంగ్లిషులో (MODI) ఉన్న అక్షరాలకు క్రమపద్ధతిలో కొత్త అర్థం చెప్పి మనసు దోచుకునే ప్రయత్నం చేశారు.

మోడీ లోని ఎం అంటే ‘‘మేకర్’’ అని.. వో అంటే ‘‘ఆఫ్’’ అని.. డీ అంటే ‘‘డెవలప్డ్’’ అని.. ఐ అంటే.. ‘‘ఇండియా’’ అంటూ కొత్త అర్థం చెప్పి మోడీని అభిమానించే వారి మనసుల్ని దోచేసుకున్నారు. అంతేకాదు.. భారతదేశానికి ఏ ఇజం సూట్ అవుతుందో సరికొత్తగా చెప్పుకొచ్చారు. దేశానికి అమెరికా తరహా కేపిటలిజం కానీ.. రష్య తరహా సోషలిజం కానీ సూట్ కాదని.. రియలిజమే పనికి వస్తుందంటూ చెప్పుకొచ్చారు. తన కొడుకు.. కూతురిని రాజకీయాల్లోకి రారని తేల్చిన వెంకయ్య తేల్చి చెప్పటం గమనార్హం. అయ్యగారి హడావుడి చూస్తుంటే.. రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించకున్నా.. అంతకు మించి మరేదో అన్న భావన కలగటం లేదూ..? మోడీ..సంఘ్ ను పొగిడేస్తున్న తీరు చూస్తేనే అర్థమవుతుందని చెప్పక తప్పదు.