Begin typing your search above and press return to search.
మోడీ దారికి వచ్చిన ఖాన్ సాబ్!
By: Tupaki Desk | 28 Aug 2019 8:39 AM GMTబహుశా బాలీవుడ్ జనాల్లో మొదటి సారి భారతీయ జనతా పార్టీ విధానాలపై , పాలనపై ఘాటు విమర్శ చేసిన వ్యక్తి ఆమిర్ ఖాన్. దేశంలో అసహనం ప్రబలుతోంది అనే భావనను మొదటగా వ్యక్తం చేసిన వారిలో ఆమిర్ ఉన్నాడు. బీజేపీ అధికారంలోకి వచ్చాకా.. ఆహారపు అలవాట్లను తప్పు పడుతూ కొంతమందిపై దాడులు జరిగాయి. ఉత్తరాదిన అవి చోటు చేసుకున్నాయి. ఆ విషయంలో ఆమిర్ నిరసన ఇన్ డైరెక్టుగా తెలిపాడు.
ఒక ఇంటర్వ్యూలో తను మాట్లాడుతూ.. అలాంటి పరిణామాలను గమనించి తన భార్యాపిల్లలు భయపడుతున్నారని - దేశం విడిపోదామా… అంటూ తనతో అంటున్నారని ఆమిర్ అన్నాడు. ఆ మాటలు వివాదం అయ్యాయి. దానిపై అనేక మంది దుమ్మెత్తి పోశారు. ఆ తర్వాత చాలా మంది మేధావులు దేశంలో అసహనం ప్రబలుతోందంటూ గళం ఎత్తారు.
ఆ తర్వాత ఆమిర్ మళ్లీ సినిమాలు చేశాడు - వాటిల్లో సూపర్ హిట్లున్నాయి.. జనాలు కూడా ఆ కామెంట్లను మరిచిపోయారు. అదలా ఉంటే ఇప్పుడు మోడీకి మద్దతుగా మాట్లాడారు ఆమిర్. అది ప్లాస్టిక్ నిషేధం విషయంలో. రెండో సారి ఉపయోగించడానికి వీల్లేని ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిరోధించాలంటూ ఇటీవలే మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మన్ కీ బాత్ లో ఈ అంశంపై మాట్లాడారు మోడీ.
ఈ నేపథ్యంలో ఆ ఉద్యమానికి ఆమిర్ మద్దతు పలికాడు. ఆ మేరకు ట్వీట్ చేశాడు. దాన్ని మోడీ రీట్వీట్ చేశాడు. ఆమిర్ మద్దతుకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇలా మోడీ రూట్లోకి వచ్చినట్టుగా ఉన్నాడు ఆమిర్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయిప్పుడు.