Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: రాత్రి 8 గంటలకు మోడీ కీలక ప్రకటన?

By:  Tupaki Desk   |   24 March 2020 7:13 AM GMT
బ్రేకింగ్:  రాత్రి 8 గంటలకు మోడీ కీలక ప్రకటన?
X
దేశాన్ని కరోనా పట్టుకున్న వేళ మొత్తం లాక్ డౌన్ కు వెళ్లిన పరిస్థితి చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రాబోయే 2వ దశ ఎంతో కీలకం కావడంతో ప్రభుత్వాలు కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తున్నాయి.

దేశంలో కరోనా మెల్లిమెల్లిగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం జనాలను ఇళ్లలోంచి బయటకు రావద్దని ప్రభుత్వం పిలుపునిచ్చింది. అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు.

జనతా కర్ఫ్యూతో గత ఆదివారం అందరినీ ఇంట్లోనే ఉండమన్న ప్రధాని మోడీ.. అది విజయవంతంతో ఇప్పుడు మరో ప్రకటనకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

తాజాగా ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఒక్కరోజుతో జనతా కర్ఫ్యూ సరిపోదని.. దీన్ని నిరంతరం కొనసాగించేలా ప్రకటన చేయబోతున్నారని తెలుస్తోంది. ఈరోజు రాత్రి ప్రధాని మోడీ చేయబోయే కీలక ప్రకటన ఏంటని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ప్రభుత్వ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఎమెర్జెన్సీ విధించబోతున్నారని తెలుస్తోంది. ఆర్టికల్ 360 ప్రకారం ఆర్థిక ఎమర్జెన్సీ విధిస్తారని అంటున్నారు. ఇందులో ఏదీ పెడతారనేది ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రధాని మోడీ క్లారిటీ ఇవ్వనున్నారు.