Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ : లాక్‌డౌన్ పై రేపు ఉదయం 10 గంటలకు మోడీ కీలక ప్రకటన !
By: Tupaki Desk | 13 April 2020 9:20 AM GMTకరోనా కట్టడి కోసం దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ గడువు ఈ నెల 14తో ముగియనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు జాతి నుద్దేశించి ప్రసంగిస్తారని వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. అయితే, చివరి నిముషం లో మోదీ ప్రసంగం రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 10 గంటలకు జాతి నుద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాయలం (పీఎంఓ) ఓ పోస్ట్ ద్వారా తెలిపింది. దీనితో రేపే లాక్ డౌన్ చివరి రోజు కావడంతో మోదీ ఏం మాట్లాడతారని.. ఎలాంటి ప్రకటన చేస్తారోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
దేశంలో ఇంకా కరోనా కట్టడిలోకి రాని , నేపథ్యంలో కరోనా ను పూర్తిగా అరికట్టడానికి దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ఈ నెల 30 వరకు లాక్ డౌన్ ను పొడగిస్తున్నట్టు ఇప్పటికే కొన్ని ప్రకటించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ ఎత్తేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశాయి. అటు మిగతా రాష్ట్రాలు సైతం లాక్‌డౌన్‌ను పెంచాలని మోదీకి సూచించాయి. ఐతే ఇటీవల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ.. ప్రజల ప్రాణాలతో పాటు ప్రపంచమూ ముఖ్యమనే వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 15 నుంచి పలు రంగాలకు మినహాయింపు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పలు మినహాయింపులు ఇవ్వనున్నట్లు తెలుస్తుండగా, దీనిపై అధికారులు కసరత్తులు చేస్తున్నారు.