Begin typing your search above and press return to search.

ఆ సీక్రెట్ ప‌త్రాల్ని బ‌య‌ట‌పెట్టాలంటూ ఆదేశం

By:  Tupaki Desk   |   25 Sep 2018 6:04 AM GMT
ఆ సీక్రెట్ ప‌త్రాల్ని బ‌య‌ట‌పెట్టాలంటూ ఆదేశం
X
దేశం కాని దేశంలో ప‌ర్య‌టిస్తున్న భార‌త ప్ర‌ధాని మ‌ర‌ణించిన వైనం అప్ప‌ట్లో సంచ‌ల‌న‌మే కాదు.. ప‌లు సందేహాల‌కు కార‌ణ‌మైంది. నీతికి.. నిజాయితీకి నిలువెత్తు రూపంగా చెప్పే మాజీ ప్ర‌ధాని లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి మ‌ర‌ణానికి సంబంధించిన అపోహ‌లు.. అనుమానాలు బోలెడ‌న్ని వినిపిస్తాయి.

దీనికి త‌గ్గ‌ట్లే ఆయ‌న మ‌ర‌ణంపై వివ‌రాలు వెల్ల‌డించేందుకు అవ‌స‌ర‌మైన కొన్ని ప‌త్రాల‌కు ర‌హ‌స్య ప‌త్రాల పేరు పెట్టి ప‌క్క‌న పెట్టేశారు. దీంతో.. శాస్త్రి మ‌ర‌ణంపై ఉన్న సందేహాలు ఇప్ప‌టికి తీర‌ని దుస్థితి. ఇలాంటివేళ‌.. ఊహించ‌ని రీతిలో షాకింగ్ ఆదేశాల్ని ఇచ్చారు కేంద్ర స‌మాచార క‌మిష‌నర్ మాడ‌భూషి శ్రీ‌ధ‌రాచార్యులు.

లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి మ‌ర‌ణానికి సంబంధించిన అన్ని ర‌హ‌స్య ప‌త్రాల్ని బ‌య‌ట‌పెట్టాలంటూ ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యంతో పాటు విదేశాంగ‌.. హోం వ్య‌వ‌హారాల శాఖ‌ల‌కు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. శాస్త్రి నిజంగానే గుండెపోటుతో మ‌ర‌ణించారా? లేదా? అన్న అంశాల్ని తేల్చేందుకు ర‌హ‌స్య ప‌త్రాల్లోని స‌మాచారం ప‌నికి వ‌స్తుంద‌న్నారు. శాస్త్రి మ‌ర‌ణంపై అన్ని విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తుంద‌న్నారు.

ర‌హ‌స్య ప‌త్రాల‌తో పాటు శాస్త్రి మ‌ర‌ణంపై నాటి జ‌న‌తాపార్టీ హ‌యాంలో నియ‌మించిన రాజ్ నారాయ‌ణ్ క‌మిటీ రికార్డుల్ని సైతం బ‌య‌ట‌కు వెల్ల‌డించాల‌ని పేర్కొన్నారు. ఇంత‌కాలం ర‌హ‌స్య ప‌త్రాలుగా దాచేసిన అంశాలు తాజా ఆదేశాల‌తో బ‌య‌ట‌కు వ‌స్తే.. మ‌రెన్ని సంచ‌ల‌నాల‌కు కార‌ణ‌మ‌వుతుందో?