Begin typing your search above and press return to search.
మోడీ చారిత్రక పథకానికి శ్రీకారం
By: Tupaki Desk | 24 Feb 2019 6:51 AM GMTకేసీఆర్ పథకాన్ని కాపీ కొట్టిన మోడీ.. ఇప్పుడు దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి శ్రీకారం చుట్టారు. నాలుగున్నరేళ్లు మీనమేషాలు లెక్కించిన బీజేపీ సర్కారు.. ఇప్పుడు కాళ్లకింద నేల కదులుతున్న వేళ జనాకర్షక పథకాలకు ఆమోదం తెలిపింది. రెండో సారి అధికారంలోకి రావడమే పరమావధిగా బీజేపీ ప్రభుత్వం ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ పథకాన్ని ప్రకటించింది. కేబినెట్ లో ఆమోదించింది. బడ్జెట్ ను విడుదల చేసింది.అర్హులైన రైతులకు చెల్లించడానికి 75 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ మంజూరు చేసింది.
ప్రధాని నరేంద్రమోడీ ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో ‘పీఎం కిసాన్’ పథకాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఐదు ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు కేంద్రం పెట్టుబడి సాయంగా రూ.6వేలను రైతుల ఖాతాల్లో వేస్తుంది. దీన్ని మూడు విడతలుగా చెల్లిస్తుంది. మొదటి దఫాగా ఈరోజు రూ.2వేలను జమచేస్తారు.
దేశవ్యాప్తంగా దాదాపు 12 కోట్ల మంది రైతులకు ఈ పథకం కింద లబ్ధి చేకూరనుంది. వీరి ఖాతాల్లో 2వేల చొప్పున జమ చేస్తారు. దీనికి సంబంధించిన విధి విధానాలను కేంద్రం పూర్తి చేసింది. అర్హులైన రైతుల ఎంపిక పూర్తై ఓ పోర్టల్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్ లైన్ చేశాయి. వాటి ఆధారంగా కేంద్రం నిధులను బదిలీ చేయనున్నాయి.
గత ఏడాది డిసెంబర్ 1న ఈ పథకం అమల్లోకి తెచ్చినట్టుగా కేంద్రం చెబుతోంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 2వేల రూపాయల బకాయిలను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మోడీ తాయిలంపై రైతుల్లో హర్షం వక్తమవుతోంది.