Begin typing your search above and press return to search.

మోడీ షాక‌య్యేలా కాల్ డ్రాఫ్ ఎపిసోడ్‌

By:  Tupaki Desk   |   27 Sep 2018 2:43 PM GMT
మోడీ షాక‌య్యేలా కాల్ డ్రాఫ్ ఎపిసోడ్‌
X
దేశాన్ని శాసించగలిగే స్థాయిలో వున్న ప్రధాని నరేంద్రమోడీకి ఊహించ‌ని ఓ చిక్కు వచ్చింది. దేశానికి రాజు లాంటి వాడైన ప్రధానికి కూడా సామాన్యుడికి ఎదురయ్యే సమస్యలు ఎదురయ్యాయి. సోషల్ మీడియా వినియోగంలో ముందుండే ప్రధాని మోడీ మొబైల్ ఫోన్ కు వచ్చే కాల్స్ కట్ అవుతున్నాయట. మామూలూ ఫోన్ కాల్స్ అయితే ఓకే కానీ అత్యవసరంగా మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురైన నేప‌థ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ క‌స్సుమ‌న్నార‌ట‌. త‌ను ఫోన్‌లో మాట్లాడుతుండగానే చాలాసార్లు లైన్ కట్ అయిపోయిందని - ప్రధాని మోడీనే స్వయంగా వెల్లడించడం టెలికాం కంపెనీల తీరుకు అద్దంప‌డుతోంది.

ప్రభుత్వ పథకాలను సమీక్షించడంలో భాగంగా మోడీ ఉన్నతాధికారులతో తరచూ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అవుతూ ఉంటారు. ఈ సందర్భంగా జరిగిన ఓ సమావేశంలో టెలికాం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను ప్రధానికి వివరించారు. వీటిలో కాల్ డ్రాప్స్ కూడా ఉన్నాయని ప్రధాని మోదీ తెలిపారు. మరి ఫోన్ కాల్స్ కు ఏం తెలుసు చెప్పండి అది ప్రధానిగారి ఫోనా? లేదా సామాన్యుడి ఫోనా? అని. మరి ప్రధానిగారికి వచ్చిన ఈ అతిపెద్ద అసౌకర్యానికి టెలికాం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ ఆగమేఘాలమీద సమస్యలు పరిష్కిరించేందుకు నానా హైరానా పడిపోయారు.

ఇలా ఫోన్ కాల్ అకారణంగా కట్ అయిపోతే ఆపరేటర్ల నుంచి ఎంత జరిమానాను వసూలు చేస్తున్నారని మోడీ ప్రశ్నించారు. దీంతో ప్రతి 3 కాల్ డ్రాప్ప్ కు రూ.1 జరిమానా విధిస్తున్నట్లు అధికారులు ప్రధానికి తెలిపారు. ఈ నేపథ్యంలో కాల్ డ్రాప్ సమస్యను పరిష్కరించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కాగా, సామాన్యుడిని వేధిస్తున్న కాల్ డ్రాఫ్ స‌మ‌స్య‌లు ఇప్పుడు మోడీకి సైతం మంట‌పుట్టింన నేప‌థ్యంలో..టెలికాం కంపెనీలు ఇక‌నైనా మెరుగైన సేవ‌లు అందిస్తాయో చూడాలి మ‌రి!