Begin typing your search above and press return to search.
కశ్మీర్ కు గల్ఫ్ నుంచి పెట్టుబడుల వరద..
By: Tupaki Desk | 30 Aug 2019 4:37 AM GMTఇటీవల గల్ఫ్ దేశాల్లో పర్యటించిన ప్రధాని మోదీకి అక్కడి బడా భారతీయ వ్యాపారులు కశ్మీర్ విషయంలో తమ పూర్తి మద్దతు ప్రకటించారు. జమ్మకాశ్మీర్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని భారత వ్యాపారవేత్తలను కోరగా అందుకు వారు అంగీకరించారు. కశ్మీర్ లో షాపింగ్ మాల్స్ నిర్మాణం.. కశ్మీర్ ఉత్పత్తుల ఎగుమతులకు ప్రోత్సాహం.. హెల్త్ కేర్ రంగంలో పెట్టుబడులు - ఫిలింసిటీ నిర్మాణం వంటి కీలక పెట్టుబడులకు ప్రవాస భారతీయులు మోదీ సమక్షంలో హామీ ఇచ్చారు.
అబుదాబి వేదికగా ఆగస్టు 24న జరిగిన ఈ కీలక సమావేశంలో గల్ఫ్ దేశాల్లోని బడా భారత వ్యాపారులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి వచ్చిన వ్యాపారవేత్తల సంపద 4 వేల కోట్ల డాలర్లకు పైమాటే. లులూ గ్రూప్ అధినేత యూసఫ్ అలీ - ఎన్ ఎంసీ హెల్త్ కేర్ అధినేత బీఆర్ షెట్టి - ల్యాండ్ మార్క గ్రూప్ అధినేత మిక్కీ జగిత్యానీ మొదలైనవారంతా దీనికి హాజరయ్యారు.
యూసఫ్ అలీ కశ్మీర్ లో షాపింగ్ మాల్స్ నిర్మాణం - అక్కడి వస్తువుల ఎగుమతి ద్వారా కశ్మీరీలకు మార్కెట్ కల్పించడం.. తమ గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తున్న 174 షాపింగ్ మాల్స్ లో రూపే కార్డులను వినియోగంలోకి తేవడం వంటివి త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. వ్యాపార పరిశీలన కోసం తమ గ్రూపు నుంచి త్వరలో ఒక బృందం కశ్మీర్ లో పర్యటించబోతోందని చెప్పారు. ఇక బీఆర్ షెట్టి కూడా కశ్మీర్ లో హెల్త్ కేర్ సేవలు ప్రారంభిస్తామని.. ఫిలిం సిటీ నిర్మిస్తామని చెప్పారు.
జమ్మూ కాశ్మీర్ - లడఖ్ రెండు ప్రాంతాల్లో అభివృద్ధికి భారీ అవకాశాలు ఉన్నాయని మోదీ చెప్పారు. అక్కడ పెట్టుబడులు పెడితే అక్కడి యువతకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయన్నారు. ఈ ప్రాంతాలు ప్రపంచంలోనే అతిపెద్ద పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉందని - అనేక మూలిక - సేంద్రీయ ఉత్పత్తులు జమ్ము-కాశ్మీర్ - లడఖ్ లో విస్తారంగా ఉన్నాయని - వాటిని గుర్తించి ప్రపంచ మార్కెట్ లో విక్రయిస్తే - అది ఈ ప్రాంతాల ప్రజలకు - రైతులకు ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. భారతదేశం నలుమూలల నుండి వచ్చిన సంస్థలు దీని కోసం ముందుకు రావాలని కోరుతున్నానని మోదీ అక్కడి వ్యాపారవేత్తలనుద్దేశించి చెప్పారు.
కాగా గల్ఫ్ దేశాలతో పాటు భారత్ లోనూ పెద్ద ఎత్తున వ్యాపారాలు సాగిస్తున్న ఈ వ్యాపారవేత్తలు ప్రభుత్వం అందించే ప్రోత్సాహంతో కశ్మీర్ లో పెట్టుబడులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే కశ్మీర్ ముఖ చిత్రమే మారనుంది.