Begin typing your search above and press return to search.
పీఎం మోడీ ఇంట ఏం జరుగుతోంది.. ఈ సంకేతాలు ఏంటి?
By: Tupaki Desk | 28 Dec 2022 1:35 PM GMTప్రధాని నరేంద్ర మోడీ ఇంట ఏదో జరుగుతోంది. రెండు రోజుల వ్యవధిలో చోటు చేసుకున్న పరిణామాలు..దేశవ్యాప్తంగా చర్చకు వస్తున్నాయి. మంగళవారం.. ఆయన సోదరుడు ప్రహ్లాద్ మోడీ.. ప్రయాణిస్తున్న కారుకు.. ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆయన కుటుంబం తీవ్రంగా గాయపడింది. దీంతో వెంటనే వెనుదిరిగి వెళ్లిపోయారు. వాస్తవానికి నాలుగు రోజుల పాటు మైసూరు పర్యాటక కేంద్రాల్లో ఈ కుటుంబం పర్యటించాల్సి ఉంది.
తాజాగా మోడీ మాతృమూర్తి హీరా బెన్(100) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను హుటాహుటిన అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. తల్లికి ఆరోగ్యం బాగాలేదని తెలిసిన వెంటనే మోడీ డిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని యూఎన్ మెహతా ఆస్పత్రి వైద్యులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో మోడీ ఇంట ఏం జరుగుతోందనే చర్చ జోరుగా సాగుతోంది.
ప్రధాని నరేంద్ర మోడీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ.. ఈ ఏడాది జూన్లో వందో సంవత్సరంలోకి అడుగుపెట్టారు. 1923 జూన్ 18న ఆమె జన్మించారు. హీరాబెన్ పుట్టినరోజున.. ప్రధాని మోడీ తన తమ్ముడు పంకజ్ మోదీ నివాసానికి వెళ్లి తల్లిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా.. తల్లి ఆశీర్వాదం తీసుకున్నట్లు ట్వీట్ చేశారు మోడీ. దాదాపు అరగంట పాటు మోదీ తన తల్లితో ముచ్చటించి అక్కడి నుంచి తిరుగుపయనమయ్యారు. ఇటీవల గుజరాత్ ఎన్నికల్లో ఆమెవీల్ చైర్‌లో అతి కష్టంమీద వచ్చి ఓటేశారు. ఇంతలోనే అనారోగ్యం పాలయ్యారు.
రాహుల్ పరామర్శ
మోడీ తల్లికి అనారోగ్యం నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. తల్లీబిడ్డల మధ్య ప్రేమ అనంతమైనదని, ఎవరి తల్లి అయినా.. ఒకటేనని చెప్పారు. ఈమేరకు ట్వీట్లో పేర్కొన్నారు రాహుల్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.