Begin typing your search above and press return to search.
విశాఖలో మోడీ ఏరియల్ సర్వే... చూసేది అదే...?
By: Tupaki Desk | 9 Nov 2022 2:30 AM GMTప్రధాని నరేంద్ర మోడీ విశాఖ వస్తున్నారు. ఆయన సుందర నగరానికి నాలుగేళ్ల తరువాత వస్తే చూడాల్సినవి ఎన్నో ఉంటాయి కదా. కానీ బిజీ షెడ్యూల్ వల్ల ప్రధాని ఏమీ చూడలేరు కూడా. పైగా ఆయన వస్తున్నది పూర్తిగా అధికారిక కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమం. అయితే ప్రధాని మోడీని విశాఖలో ఏరియల్ సర్వే చేయమని ఒక వింత కోరికను కోరారు మాజీ మంత్రి టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు.
అయితే అది వింత కోరిక మాత్రమే కాదు వైసీపీకి షాక్ లాంటి కోరిక అని అంటున్నారు. అదేలా అంటే విశాఖలో టూరిజం స్పాట్ గా రుషికొండ ఉంది. ఎవరైనా విశాఖకు వచ్చేవారు రుషికొండ చూస్తారు. అందుకే ప్రధానిని కూడా రుషికొండను చూడమని అయ్యన్నపాత్రుడు అంటున్నారు. నిండు కొండలా ఉండే రుషికొండ బోడి కొండలా ఎలా మారిపోయిందో చూడండి పీఎం సార్ అని అంటునారు. అంతే కాదు రుషికొండను అలా తయారు చేసిన వైసీపీ సర్కర్ నిర్వాకం చూడండి అని ఆయన అంటున్నారు.
కొండలను దొలచి పర్యాటకానికి ముప్పు తెస్తున్న జగన్ సర్కార్ మీద యాక్షన్ తీసుకోవడానికైనా ఈ ఏరియల్ సర్వే ప్రధాని చేయాల్సిందే అని అయ్యన్న డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు ప్రధాని విశాఖ వస్తున్న వేళ ఏపీకి ఏకైక రాజధాని అమరావతి మాత్రమే అని ప్రకటించాలని కూడా అయ్యన్న కోరుతున్నారు. ఆ విషయంలో ఏపీ ప్రజలకు ఎలాంటి డౌట్లూ లేకుండా క్లియర్ చేయాల్సినది కేంద్ర ప్రభుత్వమే అని ఆయన చెబుతున్నారు.
ఇక ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ తలపెట్టి ఇప్పటికి ఎనిమిదేళ్ళు జరిగిపోయింది. ఎప్పటిలోగా పూర్తి అవుతుందో ఎవరికె తెలియదు. అందువల్ల పోలవరం ప్రాజెక్ట్ ని వీలైనంత తొందరలో పూర్తి చేయాలని, దానికి టైం బౌండ్ విధించి అప్పటిలోగా పూర్తి చేస్తామని చెప్పాలని కూడా అయ్యన్నపాత్రుడు ప్రధానిని డిమాండ్ చేశారు. విశాఖ వస్తున్న ప్రధాని స్టీల్ ప్లాంట్ మీద కూడా హామీ ఇవ్వాలని అంటున్నారు. ప్లాంట్ ప్రైవేటేజేషన్ ఆపాలన్నది మరో డిమాండ్.
ఇవన్నీ కలపి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసినట్లుగా అయ్యన్నపాత్రుడు చెబుతున్నారు. మొత్తానికి విశాఖకు ప్రధాని వస్తున్న వేళ రుషికొండ ఇష్యూని గట్టిగా రగల్చడానికి టీడీపీ నిర్ణయించిందని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ రుషికొండ వివాదం మీద గట్టిగా పోరాడుతున్న సంగతి తెలిసిందే.
మరి ప్రదాని విశాఖ టూర్ లో ఏరియల్ సర్వే చేస్తారా. చేయాల్సిన అవసరం ఉందా. మిత్ర పక్షం కంటే ఎక్కువగా చూసుకుంటున్న వైసీపీ మీద టీడీపీ లాంటి పార్టీలు చేస్తున్న విమర్శలను పీఎం లెవెల్ లో ప్రధాని ఎలా తీసుకుంటారు. ఇవన్నీ ప్రశ్నలే. అయినా టీడీపీ విపక్షం కాబట్టి ఇవన్నీ అడుగుతోంది. కానీ ప్రధాని తాను వచ్చిన పని ఏంటో అది చూసుకుంటారు. శంకుస్థాపనలు చేసి ఆయన వెళ్ళిపోతారు. అదేగా జరిగేది మరి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.