Begin typing your search above and press return to search.
పుల్వామా ఉగ్రదాడి రోజు మోడీ ఏం చేస్తున్నారంటే?
By: Tupaki Desk | 21 Feb 2019 10:42 AM GMTదేశ ప్రజల్ని ఉలిక్కిపడేలా చేయటమే కాదు.. దాయాది మీద మరింత కసిని పెంచిన ఉదంతంగా ఉల్వామా ఉగ్ర ఘటనగా చెప్పాలి. వందల కేజీల ఆర్డీఎక్స్ ఉన్న వాహనాన్ని జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంతో ఢీ కొనటం ద్వారా ఆత్మాహుతికి పాల్పడిన ఉగ్రవాది పైశాచికం.. నలబై నిండుప్రాణాల్ని బలయ్యేలా చేసింది. ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చిన ఈ ఉదంతం జరిగిన రోజున ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఘటన జరిగిన కొద్ది గంటల తర్వాత ఆయన తీసుకున్న చర్యలేంటి? ఇంతకీ ఆయనకీ విషయంపై సమాచారం ఎప్పటికి అందింది? ఆ తర్వాత ఆయనేం చేశారు? లాంటి ప్రశ్నలు తలెత్తేలా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా కొత్త కోణాన్ని ఆవిష్కరించారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ వైఫల్యంతోనే పుల్వామా ఉగ్రదాడి చోటు చేసుకుందని ఆరోపించిన ఆయన.. మోడీ తన చేతకానితనాన్ని ఒప్పుకోవాల్సిందేనని మండిపడ్డారు. ఉగ్రదాడి జరిగిన రోజున ప్రధాని మోడీ ఒక సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నట్లు ఆయన ఆరోపించారు. ఘటన జరిగిన కొద్ది గంటల తర్వాత కూడా ఆయన షూట్ లోనే ఉన్నారన్నారు.
నలబై మంది వీర జవాన్లు ప్రాణాలు అర్పించి దేశం యావత్తు రోదిస్తుంటే.. ప్రధాని మోడీ మాత్రం ఒక సినిమా షూటింగ్ లో బిజీగా గడిపినట్లుగా ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించిన ఒక ఫోటోను మీడియాకు చూపించారు. ఇలాంటి ప్రధానమంత్రి ప్రపంచంలో మరెక్కడైనా ఉంటారా? అంటూ ఫైర్ అయ్యారు.
పుల్వామా ఉగ్రదాడి అనంతరం ప్రధాని వ్యవహారశైలి చూశాక తన నోటి నుంచి మాటలు రావటం లేదన్న రణదీప్ .. మోడీ సర్కారుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఉగ్రదాడిలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ వైఫల్యాలపై ప్రధాని మోడీ ఎందుకు బాధ్యత వహించటం లేదు? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ప్రశ్నల్ని సంధించారు.
+ అంత పెద్దమొత్తంలో పేలుడు పదార్థాలు, రాకెట్ లాంచర్లు దేశంలోకి ఎలా వచ్చాయి?
+ ఆ వాహనం దేశంలోకి ఎలా ప్రవేశించింది? దాడి చేస్తామంటూ ఉగ్రవాదులు వీడియో విడుదల చేసినా ఎందుకు పట్టించుకోలేదు?
+ పోలీసుల రాసిన లేఖను సైతం ఎందుకు పక్కన పడేశారు?
+ విమానాల్లో వెళ్తామని సీఆర్ పీఎఫ్ కోరినా ఎందుకు అంగీకరించలేదు?
+ గత 56 నెలల్లో 488 మంది సైనికులు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది?