Begin typing your search above and press return to search.

చైనా అధ్యక్షుడికి అపూర్వ స్వాగతం

By:  Tupaki Desk   |   11 Oct 2019 10:26 AM GMT
చైనా అధ్యక్షుడికి అపూర్వ స్వాగతం
X
రెండు రోజుల పర్యటన నిమిత్తం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్ కు చేరుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1.20 గంటలకు ప్రత్యేక విమానంలో చైనా అధ్యక్షుడు చెన్నై లో దిగారు.

ప్రధాని మోడీ, తమిళనాడు సీఎం ఫళనిస్వామిలు జిన్ పింగ్ కు స్వాగతం పలికారు. ప్రధాని మోడీ స్వయంగా జిన్ పింగ్ కోసం చెన్నై విమానాశ్రయానికి ముందుగా వచ్చి స్వాగతం పలుకడం విశేషం.

ఇక భారత్ లో అడుగుపెట్టిన చైనా అధ్యక్షుడికి ఘన స్వాగతం లభించింది. 2000 మంది విద్యార్థులు చైనా జాతీయ జెండా పోలిన ఎర్రటి టీషర్టులు ధరించి భారత, చైనా జాతీయ జెండాలతో చైనా అధినేతకు అపూర్వ స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి జిన్ పింగ్ బస చేసే ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్ వరకు చిన్నారులు చైనా అధ్యక్షుడికి అభివాదం చేశారు.

ఇక చైనా అధ్యక్షుడి కోసం తమిళనాడు ఉద్యానవన శాఖ పండ్లు, కూరగాయలతో స్వాగత తోరణాలు ఏర్పాటు చేసింది. భారత ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మధ్య రెండోసారి అనధికార భేటి జరుగనుంది. 2018 చైనా సరిహద్దు డోక్లాం వివాదం తర్వాత ఇది రెండో భేటి కావడం విశేషం.

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఒకప్పుడు బౌద్ధం వెలిసిన.. భౌద్దం వ్యాప్తిచెందిన మహాబలిపురం సందర్శన కోసం భారత్ కు వచ్చారు. అనధికార పర్యటనలో జిన్ పింగ్ కు తోడుగా మోడీ ఉండి ఆయనతోపాటు పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. రెండు రోజుల పాటు చైనా అధ్యక్షుడు భారత్ లో ఉంటారు. శనివారం మధ్యాహ్నం చైనా వెళ్లిపోతారు.