Begin typing your search above and press return to search.
ఈ ముతక మాటలేంది మోడీ?
By: Tupaki Desk | 10 Dec 2018 5:22 AM GMTఎంత పెద్ద కెరటమైనా.. ఎక్కువ సేపు ఎగిసిపడి ఉండలేదు. రాజకీయ నాయకులు సైతం అలాంటివారే. ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటం మాదిరి కొన్నిసార్లు వారి కెరీర్ ఓ రేంజ్లో సాగుతుంది. అత్యుత్తమ స్థానాలకు ఎదగటం కష్టమే అయినా.. అక్కడకు చేరిన తర్వాత ఆ స్థానాన్ని నిలుపుకోవటం అందరికి సాధ్యమయ్యేది కాదు. ఆ విషయంలో మోడీ సైతం మినహాయింపు కాదన్నది తాజాగా ఆయన చేస్తున్న వ్యాఖ్యల్ని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు.
మాటల మాంత్రికుడిగా..తన మాటలతో ఎలాంటి వారినైనా తనకు అనుకూలంగా మార్చుకునే తత్త్వం దండిగా ఉండే మోడీ సైతం మాటల్ని మడతపెట్టి మాట్లాడటం ఇప్పుడు పెను వివాదంగా మారింది. రాజకీయాలకు సంబంధించి.. ఎన్నికల సందర్భంగా చోటు చేసుకునే ప్రచారం సందర్భంగా మోడీలోని అసలు వ్యక్తి నిద్ర లేస్తాడు. అప్పటివరకూ వ్యక్తిత్వ వికాస నిపుణుడిలా మాట్లాడిన ఆయన.. తన రాజకీయ ప్రత్యర్థులపై దురుసుగా.. దూకుడుగా విమర్శలు చేస్తుంటారు.
ఈ సందర్భంగా కొన్నిసార్లు బ్యాలెన్స్ మిస్ అవుతుంటారు. తాజాగా ఆయన నోటి నుంచి ఒక వ్యాఖ్య కాస్త ఆలస్యంగా వివాదాస్పదమైంది. వారం క్రితం రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్య ఒకటి సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు వైరల్ అయ్యింది. ఆయన చేసిన వ్యాఖ్యను విన్న వారు పలువురు.. మోడీ లాంటోడు మరీ ఇంత ముతకగా మాట్లాడాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు.
ఇంతకూ మోడీ ఏం మాట్లాడారన్నది చూస్తే.. కాంగ్రెస్ ఎన్నో కుంభకోణాలకు పాల్పడింది. వితంతు పింఛను పథకం స్కాం కూడా అందులో ఒకటి. మరి.. ఏ కాంగ్రెస్ వితంతువు అకౌంట్లోకి ఈ మొత్తం చేరిందో అంటూ మండిపడ్డారు. అయితే.. ఈ వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి సోనియాగాంధీని ఉద్దేశించి చేసిందన్న విమర్శ అంతకంతకూ పెరుగుతోంది.
ప్రధాని మోడీ దిగజారుడుతనానికి ఇదో ఉదాహరణ అని.. ఆయన వ్యాఖ్యలు ప్రధానమంత్రి హోదాకే కళంకం తెచ్చి పెట్టాయన్న మండిపాటు పలువురి నోట వినిపిస్తోంది. తన వ్యాఖ్యల ద్వారా మోడీ మహిళల్ని అవమానించారంటూ మరో వాదనను తెర మీదకు తీసుకొచ్చారు కాంగ్రెస్ నేతలు. అయినా.. మాటలతో మనసుల్ని దోచేసే మోడీ లాంటోడి నోటి నుంచి ఈ తరహాలో ముతక మాట వచ్చుడేందో..?