Begin typing your search above and press return to search.
యాక్సిడెంట్ లో మిసెస్ మోదీకి గాయాలు!
By: Tupaki Desk | 7 Feb 2018 8:22 AM GMTదేశంలో రోడ్డు ప్రమాదాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. నిత్యం పదుల సంఖ్యలోనే జనం ప్రమాదాల కారణంగా ప్రాణాలు విడుస్తుండగా, వందలాది మంది ఆసుపత్రి పాలవుతున్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టినా... పెద్దగా ఫలితం ఉండటం లేదు. గతంలో మాదిరిగి గతుకుల రోడ్డు స్థానే ఇప్పుడు తళతళ మెరిసిపోతున్న ఎక్స్ ప్రెస్ హైవేలు అందుబాటులోకి వచ్చాయని సంతోషపడాలో, అదే రోడ్లపై లెక్కలేనన్ని ప్రమాదాలు జరుగుతున్నాయని బాధపడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రోడ్డు ప్రమాదాల్లో ఇప్పటికే చాలా మంది నేతలను పోగొట్టుకున్నాం. అదే సమయంలో ఇదే రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాలు అనాథలుగా మారిపోయి... భవిష్యత్తు అంధకారం కాగా... దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.
అయినా ఇప్పుడు రోడ్డు ప్రమాదాల గురించి అంతగా చెప్పుకోవాల్సింది ఏముంది? అనేగా మీ ప్రశ్న? అయితే అక్కడిరే వస్తున్నాం. నేటి ఉదయం చోటుచేసుకున్న ఓ రోడ్డు ప్రమాదం.. మరోమారు ప్రమాదాల ద్వారా జరుగుతున్న నష్టాన్ని గుర్తుకు తెచ్చుకునేలా చేసిందని చెప్పాలి. రాజస్థాన్‌లో నేటి ఉదయం కోటా-చిత్తోర్ హైవే పై జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో జశోదా బెన్ గాయాలపాలయ్యారు. అయినా ఈ జశోదా బెన్ ఎవరో తెలుసా? ఇంకెవరండీ బాబూ.. మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సతీమణి జశోదా బెన్నే. గుజరాత్‌లో ఉండే జశోదా బెన్ తన కుటుంబ సభ్యులతో కలిసి రాజస్థాన్‌కు చెందిన తమ బంధువుల ఇంట జరిగిన ఓ శుభకార్యానికి హాజరయ్యారు. కారులో బయలుదేరిన జశోదా ఫ్యామిలీ... శుభకార్యం ముగియగానే నేటి ఉదయం రాజస్థాన్ నుంచి అదే కారులో తిరుగు పయనమైంది.
ఈ క్రమంలో నేటి ఉదయం కోటా-చిత్తోర్ హైవే పై చిత్తోర్ గఢ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ కారు ముందు భాగం పూర్తిగా దెబ్బ తినింది. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఓ వ్యక్తి చనిపోగా... జశోదా సహా పలువురికి గాయాలయ్యాయి. జశోదా తలకు గాయం అయ్యింది. ఈ ప్రమాదంతో షాక్ తిన్న అధికార యంత్రంగం చాలా వేగంగానే స్పందించింది. హుటాహుటీన అక్కడికి చేరుకుని జశోదాతో సహా చనిపోయిన వ్యక్తి మృతదేహంతో పాటు ఇతర క్షతగాత్రులను కూడా చిత్తోర్ గఢ్ ఆసుపత్రికి తరలించింది. జశోదాకు ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు భయపడాల్సింది ఏమీ లేదని తెలిపారు. మొత్తంగా రోడ్డు ప్రమాదంలో ప్రధాని మోదీ సతీమణికే గాయాలు కావడం నిజంగానే షాకింగ్ ఉదంతంగానే చెప్పుకోవాలి.