Begin typing your search above and press return to search.

ట్వీట్ కాదు.. డైరెక్ట్ గా పోన్ కాల్ చేసి విషెస్

By:  Tupaki Desk   |   16 Aug 2015 6:50 AM GMT
ట్వీట్ కాదు.. డైరెక్ట్ గా పోన్ కాల్ చేసి విషెస్
X
సోషల్ మీడియా శక్తివంతం అయ్యాక.. ముఖ్యమైన విషయలతో పాటు.. ఎవరినైనా అభినందించాలన్నా.. విమర్శించాలన్న తమ మాటల్ని తమ ట్విట్టర్.. ఫేస్ బుక్ ఖాతాల్లో పోస్ట్ చేయటం మామూలైంది. మిగిలిన నాయకులతో పోలిస్తే.. ప్రధాని మోడీ ట్విట్టర్ ఖాతాతో పలు అంశాల్ని ఎప్పటికప్పుడు తెలియజేయటం తెలిసిందే. రాజకీయాల్లో ఉండే విభేదాలు.. విద్వేషాల్ని పక్కన పెట్టేసి.. పుట్టినరోజు శుభాకంక్షాలు.. వర్థంతి సానుభూతి మాటల్ని ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేయటం మామూలే.

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా దాదాపు అందరికి పుట్టినరోజు విషెష్ ను ప్రధాని మోడీ ట్వీట్ రూపంలో చెప్పటం తెలిసిందే. తాజాగా మాత్రం అందుకు కాస్త బిన్నంగా వ్యవహరించారు మోడీ.

ఆదివారం.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రెగ్యులర్ ఫార్మాట్ లో ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేయటం స్థానే.. ఆయనకు నేరుగా ఫోన్ చేశారు. కేజ్రీవాల్ కు తాను స్వయంగా ఫోన్ చేసి విషెష్ చెప్పిన విషయాన్ని మోడీ తన ట్వీట్ ద్వారా వెల్లడించారు.

కేజ్రీవాల్ ఆరోగ్యంతో ఉండాలని కోరుకున్నట్లు మోడీ తన ట్వీట్స్ తో తెలిపారు. కేజ్రీవాల్ కు తాను ఫోన్ చేసి విషెష్ చెప్పిన విషయాన్ని మోడీ ట్వీట్స్ ద్వారా తెలియజేయటంతో.. కేజ్రీవాల్ కూడా స్పందించారు. మోడీతో తాను కాసేపు మాట్లాడుకున్నాని.. మనసును తాకేలా మాట్లాడారంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. త్వరలో తాను ప్రధానమంతరిని కలిసి ఢిల్లీ పరిస్థితుల్ని వివరిస్తానని వెల్లడించారు. తాజా.. కేజ్రీవాల్ కు బర్త్ డే విషెస్ చెప్పేందుకు ప్రధాని మోడీ చేసి ఫోన్ కాల్ రెండు రాజకీయ పక్షాల మధ్యనున్న దూరాన్ని తగ్గిస్తాయేమో చూడాలి.