Begin typing your search above and press return to search.
మోడీ రాంగ్ టైమింగ్.. ఆంధ్రోళ్లకు ఎక్కడో కాలేలా చేసింది
By: Tupaki Desk | 4 Jun 2020 2:30 AM GMTఎంత తెలివోడైనా కొన్నిసార్లు తప్పులు చేస్తుంటారు. అందుకు ప్రధాని మోడీ సైతం మినహాయింపు కాదన్నది తాజా పరిణామాన్నిచూస్తే అర్థం కాక మానదు. ఎవరికి అర్థం కాని రీతిలో ఎత్తులు వేస్తూ.. ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వని మోడీలో మరో గుణం ఏమంటే.. రాంగ్ టైమింగ్ అన్నది ఉండదు. ఆ మాటకు వస్తే.. ఆయన టీంలో ఎవరూ అలాంటి పొరపాటు చేయటం కనిపించదు. అలాంటి మోడీ తొలిసారి తప్పు చేశారా? అంటే.. అవునన్న మాట వినిపిస్తోంది.
తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఒకటి ఏపీ ప్రజల్ని కెలికేలా చేయటమే కాదు.. వారు హర్ట్ అయ్యేలా చేసిందని చెప్పాలి. జూన్ 2.. తెలుగు మాట్లాడే ప్రజల్లోని రెండు ప్రాంతాల వారికి భిన్నమైన అనుభవాన్ని మిగిల్చిన రోజు. తెలంగాణ ప్రజలు పండుగ చేసుకునే రోజు.. ఏపీ ప్రజలు మాత్రం విషాదంలో మునిగిపోయేరోజు. కలిసి ఉన్న రాష్ట్రం ముక్కలైపోయిందన్న వేదనను అనుభవిస్తుంటారు. అదే సమయంలో తెలంగాణలో మాత్రం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుగుతూ సంబరాలు నిర్వహిస్తుంటారు. అయితే.. జూన్ 2ను వీలైనంత వరకూ మర్చిపోవాలన్నట్లుగా ఏపీ ప్రజల తీరు ఉంటుంది.
తెలంగాణ ప్రజల మనసుల్ని దోచుకోవాలన్న లక్ష్యంతో ఉన్న ప్రధాని మోడీ.. తాజాగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ నేపథ్యంలో ఒక ట్వీట్ చేశారు.
తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడే చేయకూడని తప్పు ఒకటి చేశారు మోడీ. తెలంగాణ ప్రజలకు తెలుగులో ట్వీట్ చేసిన ఆయన.. కాసేపటికి ఏపీ ప్రజలను ఉద్దేశించి మరో ట్వీట్ చేశారు. అందులో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. కృషి, పట్టుదల, సంస్కృతికి మారు పేరు ఏపీ. దేశ పురోభివృద్ధిలో ఏపీ భూమిక ఎంతో గణనీయమైనదంటూ ట్వీట్ చేశారు. ఏపీ ప్రజల అన్ని ప్రయత్నాలు విజయవంతం కావాలని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ ట్వీట్ ఏపీ ప్రజలకు ఎక్కడో కాలేలా చేసింది. అప్పటికే విభజన విషాదంలో ఉన్న వారికి.. మోడీ తమకు ఇస్తామన్న ప్రత్యేక హోదా గుర్తుకు వచ్చింది. విభజన నిర్ణయంతో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంతో జరిగిన నష్టం ఒక ఎత్తు అయితే.. దాన్ని భర్తీ చేస్తానన్న హామీ ఇచ్చిన మోడీ తర్వాత దాన్ని పట్టించుకోవటమే మానేశారు. ఇప్పటికే హోదా సాధన కోసం ఏపీ ప్రజలు చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు.
కానీ.. మోడీ సర్కారు మాత్రం ససేమిరా అంటోంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పలువురు చెలరేగిపోతున్నారు. ఏపీని అన్ని విధాలు మోసం చేసిన మోడీ.. ఇప్పుడు కృషి, పట్టుదల, విజయవంతం అంటూ ట్వీట్లు చేయటమా? అని మండిపడుతున్నారు. అమరావతి శంకుస్థాపన రోజున రెండు చెంబుల్లో మట్టి.. నీళ్లు తీసుకొచ్చి హ్యాండిచ్చిన మోడీ.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా ఏపీ ప్రజలకుశుభాకాంక్షలు చెప్పటాన్ని ప్రస్తావిస్తూ మండిపడుతున్నారు.
మోడీ ట్వీట్ కు పలువురు ప్రత్యేక హోదా సంగతేమిటంటూ ప్రశ్నిస్తే.. మరికొందరు.. ఏపీఎంపీల అవసరం రాకూడదని ప్రార్థించుకో అంటూ చురకలేశారు. మొత్తంగా రాంగ్ టైంలో ఏపీ ప్రజల్ని ప్రధాని మోడీ కెలికారన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.