Begin typing your search above and press return to search.
మోడీ మంచోడైతే నాకేంటి అంటున్నట్రంప్
By: Tupaki Desk | 27 Feb 2018 8:24 AM GMTభారత ప్రధాని నరేంద్ర మోడీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సెటైర్లు వేశారు. ఈ మధ్యే యూఎస్ చట్టప్రతినిధులతో సమావేశంలో మాట్లాడుతూ...`అమెరికా మోటార్‌సైకిల్స్‌పై టారిఫ్ ను 75 శాతం నుంచి 50 శాతానికి తగ్గించినట్లు మోడీ చెప్పారు. అదో గొప్ప విషయమన్నట్లు ఆయన మాట్లాడారు. అసలు ఇండియా మోటార్ సైకిల్స్ పై అమెరికా పన్నే వేయడం లేదు` అని ట్రంప్ అన్నారు. తాజాగా సోమవారం మరోసారి ఇదే అంశాన్ని ఆయన లేవనెత్తారు. గత రెండు వారాల్లో మోడీపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తంచేయడం ఇది రెండోసారి. ఆయన బాధంతా అమెరికా మోటార్ సైకిల్స్ పై ఇండియా భారీగా పన్ను వేయడం గురించి.
తాజా సమావేశంలో ప్రధాని మోడీని అనుకరిస్తూ.. రెండు చేతులూ జోడించి నమస్తే చెబుతూ సెటైర్ వేశారు. `మోడీ చాలా మంచివారు. ఆయన ఏం చెప్పారంటే.. మన మోటార్ సైకిళ్లపై పన్నును 50 శాతానికి తగ్గించారట! దీనికి నేను ఏం చెప్పగలను? ఇది విని నేను థ్రిల్ ఫీలవ్వాలా!?` అంటూ ట్రంప్ ఎద్దేవా చేశారు. దీంతో ట్రంప్ తీరుపై మన వ్యాపారవేత్తలు - అధికారులు ఆశ్చర్యపోతున్నారు. చాన్నాళ్లుగా వాణిజ్యం విషయంలో ఏ దేశంతోనైనా ట్రంప్ కఠినంగా ఉంటున్నారు. వాళ్లు పన్ను వేస్తే మనమూ వేద్దామన్నట్లుగా ఆయన తీరు ఉంది. తన ప్రచారంలోనూ చైనాపై ట్రంప్ విరుచుకుపడ్డారు. ఇప్పుడు మిత్రదేశమైనా సరే ఇండియా వ్యవహరిస్తున్న తీరుపై ట్రంప్ గుర్రుగా ఉన్నారు.
కాగా, గత వారం చైనాతో కలిపి మనపై ట్రంప్ మండిపడిన సంగతి తెలిసిందే. భారత్ - చైనాలపై ట్రంప్ మరోసారి నోరు పారేసుకున్నారు. ఆ రెండు దేశాల వల్లే భూతాప నివారణకు కుదిరిన పారిస్ ఒప్పందం నుంచి తాము వైదొలిగామని ట్రంప్ అన్నారు. ఇదిలా ఉండగా, వివిధ దేశాలలోని ఉత్తరకొరియాకు చెందిన బ్యాంకులు హవాలా లావాదేవీలకు పాల్పడుతున్నాయని, ఉగ్రవాద సంస్థలకు నిధులు అందజేస్తున్నాయని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఆరోపించింది. దీంతో ఆ బ్యాంకుల శాఖలను మూసివేయాలని అన్ని దేశాలకు విజ్ఞప్తి చేసింది.