Begin typing your search above and press return to search.
మోడీ.. నవాజ్ లతో శివసేన రామాయణం!
By: Tupaki Desk | 5 Oct 2016 9:34 AM GMTఉరీ ఉగ్రఘటనకు ప్రతీకారంగా భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్ పాకిస్థాన్ కు దిమ్మతిరిగేలా చేసింది. ఇక, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఇంటా బయటా కూడా అందరూ తలంటేస్తున్నారు. పాకిస్థాన్ లోని విపక్షాలు పెద్ద ఎత్తున షరీఫ్ ను తిట్టిపోస్తున్నాయి. చీము - నెత్తురు లేదంటూ విమర్శిస్తున్నాయి. ఇక, అంతర్జాతీయంగా కూడా షరీఫ్ ను పలు దేశాలు దుయ్యబడుతున్నాయి. ముఖ్యంగా ఆయన ఎంతో ప్రేమించే చైనా - అమెరికాలు సైతం పాక్ ను ఈ విషయంలో వేలెత్తి చూపిస్తున్నాయి. దీంతో నవాజ్ కి నిద్ర పట్టడం లేదని పాక్ మీడియా పేర్కొంటోంది.
ఇక, ఇదే సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీకి అన్ని పక్షాల నుంచి నీరాజనం అందుతోంది. మోడీని హీరోతో పోలుస్తూ.. కథనాలు వస్తున్నాయి. మోడీని రోజూ తిట్టిపోసే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సైతం మోడీకి సెల్యూట్ చేస్తున్నానంటూ పెద్ద ఎత్తున ట్విట్టర్ లో పొగడ్తల వర్షం కురిపించారు. తాజాగా, మోడీ నియోజకవర్గం ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో శివసేన కార్యకర్తలు మోడీని రాముడితో పోలుస్తూ.. భారీ ఎత్తున పోస్టర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దసరా ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో రాముడు.. రావణాసురుడిని చంపే ఘట్టాన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.
ఈ క్రమంలో శివసేన కార్యకర్తలు .. మోడీని రాముడిగా పేర్కొంటూ.. పాక్ ప్రధాని నవాజ్ ను పది తలలున్న రావణాసురిడిగా అభివర్ణిస్తూ.. పెద్ద ఎత్తున పోస్టర్లు ఏర్పాటు చేశారు. అదేసమయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను మేఘనాథుడిగా వర్ణించడం విశేషం. శివసేన వారణాసి శాఖ పేరుతో వెలిసిన ఈ పోస్టర్లలో మోదీ రాముడిలా పదితలలతో ఉన్న నవాజ్ షరీఫ్ పై బాణాలు సంధిస్తున్నట్లు చిత్రాలు ఉన్నాయి.
భారత్ మరో సర్జికల్ స్ట్రయిక్స్ జరపాల్సిందేనని కూడా ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. రావణ రూపంలో పాక్ ఉందని ఆ దేశ అంతు చూడాలని పోసర్ల ద్వారా తమ ఆకాంక్షను తెలిపారు. వారణాసి నగరం మొత్తం వెలిసిన ఈ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో ఈ పోస్టర్లు హల్ చల్ చేస్తున్నాయి. ఏదేమైనా మనోళ్ల క్రియేటివిటీ బాగుందికదా!!.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/