Begin typing your search above and press return to search.
రోటీన్ కు భిన్నమైన సీన్ ఇస్రోలో..క్రెడిట్ గోస్ టు మోడీ
By: Tupaki Desk | 7 Sep 2019 5:12 AM GMTతీవ్రంగా శ్రమించిన తర్వాత కూడా ఫలితం దక్కకపోతే ఎలా ఉంటుంది. ఒక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు సక్సెస్ అయ్యిందో.. కాలేదో అన్న సందిగ్థత నెలకొన్న వేళ.. ఎలాంటి వాతావరణం ఉంటుంది? అప్పటివరకూ ఉన్న ఉత్సాహం స్థానే నిరాశ నిండుకుంటుంది. ఇక.. ఇస్రో లాంటి సంస్థల్లో అయితే.. పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. పాజిటివ్ ఫలితం వచ్చినప్పుడు ఉండే ఉత్సాహం నెగిటివ్ ఫలితం వచ్చిన వేళ ఉండదు సరికదా.. రాజకీయ పక్షాల నుంచి ప్రభుత్వాల నుంచి వచ్చే స్పందన ఇబ్బందికరంగా ఉంటుంది.
ఇప్పటివరకూ ఇలాంటివెన్నో చూసిన ఇస్రోకు ఈ రోజు అందుకు భిన్నమైన అనుభవం ఎదురైంది. దీనికి కారణం ప్రధాని మోడీనే. చంద్రయాన్ ప్రయోగంలో అత్యంత కీలకమైన ల్యాండర్ విక్రం చంద్రుడి మీదకు దిగాల్సిన దానికి ఐదు నిమిషాల ముందు నుంచి సంకేతాలు రావటం ఆగిపోవటం తెలిసిందే. ఈ నేపథ్యంలో తీవ్రమైననిరాశలో కూరుకుపోయింది ఇస్రో టీం. ఇలాంటివేళలో.. ముఖ్యఅతిధిగా హాజరయ్యే వారు ఆగ్రహంతోనో.. ఇతర భావోద్వేగాలతోనో వెళ్లిపోతుంటారు. ఇందుకు భిన్నంగా ప్రధాని మోడీ మాత్రం బెంగళూరులోనే ఉండిపోవటమే కాదు.. ఉదయాన్నే ఇస్రో టీంను ఉద్దేశించి భావోద్వేగంతో మాట్లాడి వారిని ఉత్తేజితుల్ని చేశారు.
రోటీన్ కు భిన్నమైన అనుభవం ఈ రోజు ఇస్రో టీంకు ఎదురైంది. వారు పడిన శ్రమను తాను గుర్తించటమే కాదు.. యావత్ దేశం గర్విస్తోందన్న విషయాన్ని మోడీ నోటి మాటలతో రావటం వారికిప్పుడు సాంత్వన కలిగేలా చేస్తుందని చెప్పక తప్పదు. నిరాశతో నిండుకున్న వారిని ఊరడించేలా మాట్లాడిన మోడీ మాటలు సరికొత్త ఉత్తేజాన్ని ఇవ్వటమే కాదు.. మరింత కసిగా పని చేసేలా చేస్తాయని చెప్పక తప్పదు. భారత్ మాతాకీ జై అంటూ తన ప్రసంగాన్ని మొదలెట్టిన మోడీ.. తిరిగి అదే నినాదాన్ని మూడుసార్లు చేసి తన ప్రసంగాన్ని ముగించారు.
మోడీ ప్రసంగంలోని ప్రధానాంశాల్ని చూస్తే..
% దేశం కలల్ని సాకారం చేసేందుకు ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపారు. వారందరికి దేశం అండగా ఉంటుంది. చంద్రయాన్ 2 విజయం కోసం శాస్త్రవేత్తలు చూపిన తెగువకు దేశమంతా గర్విస్తోంది. భారతమాత తలెత్తుకునేలా ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేశారు.
% శాస్త్రవేత్తల మానసిక స్థితిని అర్థం చేసుకోగలను. మీ కష్టం ఎప్పటికి వమ్ము కాదు. మీ వెనుక కోట్లాది మంది భారతీయుల మద్దతు ఉంది. దేశం మీ వెంటే ఉంటుంది. అందరి కలల్ని సాకారం చేసేందుకు మీరెంతో శ్రమించారు. ఇలాంటి సమయాల్లో మరింత వివేకాన్ని ప్రదర్శించాలి.
% మీరు దేశం కోసం మీ జీవితాన్నే త్యాగం చేశారు. అధైర్యపడకండి. ఈ ప్రయోగం విజయవంతం కావాలని మీరు.. మీతో పాటు మేం కూడా ఎంతో కోరుకున్నాం. కానీ.. జయాపజయాల్ని ధైర్యంగా స్వీకరించాలి. మీ కష్టం మీ కళ్లల్లో కనిపిస్తోంది.
% ఇదెంత మాత్రం వెనుకడుగు కానే కాదు. శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలకు గర్వపడుతున్నా. మీరు సంతోషించే మరెన్నో అవకాశాలు మున్ముందు వస్తాయి. ఈ రోజు మనకు ఎదురైన పాఠాలు... మనల్ని మరింత ధృఢంగా తీర్చిదిద్దుతుంది. ప్రతి సమస్య మనకు కొత్త విషయాలను నేర్పుతుంది. చంద్రయాన్-2 విషయంలో శాస్త్రవేత్తలు గొప్ప ప్రయత్నం చేశారు. సైన్స్‌లో ఫెయిల్యూర్ అనే మాటే లేదు.
% మీరు చేసే ప్రయోగాలు ప్రతి భారతీయుడు గర్వంగా తలెత్తుకునేవి. యావత్ దేశం మీకు సంఘీభావంగా మేల్కొనే ఉంది. ఇదెంతమాత్రం వెనకడుగు కాదు. మిమ్మల్ని చూసి జాతి గర్వంతో పొంగిపోతోంది. మన విజయాలకు మరిన్ని భారీ లక్ష్యాల్ని పెట్టుకోవాలి. ప్రతి సందర్భంలోనే మన సత్తా చాటుదాం. ఈ రోజు మనకు ఎదురైన పాఠాల్ని మనల్ని మరింత బలంగా తయారు చేస్తాయి.
% శాస్త్రవేత్తల కుటుంబాలకు సెల్యూట్ చేస్తున్నా. దీనిలో వారి త్యాగం ఎంతో ఉంది. మన అడ్డంకులే మన మనోబలాన్ని మరింత పెంచుతాయి. మీరుచూపించిన తెగువ దేశానికే కాదు.. యావత్ ప్రపంచానికి నిర్దేశం చేసింది. మనం రానున్నరోజుల్లో మరిన్నిఅంతరిక్ష ప్రయోగాల్ని చేపట్టాలి. ఎన్నో ఆటంకాల్ని విజయవంతంగా అధిరోహించిన చరిత్ర ఇస్రోకు ఉంది. భవిష్యత్తులో మరిన్ని విజయాల్ని మీరు సాధిస్తారన్న నమ్మకం నాతో పాటు ఈ దేశ ప్రజలకూ ఉంది. చంద్రయాన్ 2 విషయంలో శాస్త్రవేత్తలు గొప్ప ప్రయత్నాలు చేశారని గర్వంగా చెప్పగలను.