Begin typing your search above and press return to search.

మోడీ న్యూ స్కీం: గీకండి...గెలవండి!

By:  Tupaki Desk   |   12 Dec 2016 6:52 AM GMT
మోడీ న్యూ స్కీం: గీకండి...గెలవండి!
X
నల్లధనం గొడవ కంటే నగదు రహిత లావాదేవీల ఉద్యమం ఇప్పుడు దేశంలో హాట్ టాపిగ్గా మారింది. ఎక్కడ విన్నా ఇప్పుడు ఇదే మాట. నగదు రహిత లావాదేవీల చేసే వారి కోసం నీతి అయోగ్‌ ఒక పధకాన్ని ప్రవేశపెట్ట బోతున్నట్లు సమాచారం. ప్రాధాన్యత సంతరించుకున్న ఈ స్కీమ్‌కు సంబం ధించి కసరత్తు పూర్తి కావచ్చింది. త్వరలోనే అధికారికంగా ఒక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. ఎలక్ట్రానిక్‌ చెల్లింపులు చేస్తున్న వారికి కోటి రూపాయల బహుమతితో పాటు పలు రకాల ఆకర్షణీయమైన ఆఫర్లు ఇవ్వాలని నీతి అయోగ్‌ సంకల్పించినట్లు తెలిసింది.

ఇందుకు సంబంధించిచొరవ తీసుకోవాల్సిందిగా నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను నీతిఆయోగ్ కోరినట్లు సమాచారం. దీని కోసం రూ.12 కోట్లను కూడా కేటాయించారట. పట్టణాలతో పాటు గ్రామాలలో కూడా ప్రజలను ఈ దిశగా ప్రోత్సాహించడానికి ఈ స్కీమ్‌ను ప్రవేశపెడుతున్నట్లు చెబుతున్నారు. ప్రతీ 3 నెలలకు ఒకసారి లక్కీ డ్రా తీసి కోటీ రూపాయలు, వారానికి పది లక్షలు రూపాయలు పది మంది వినియోగదారులు, పది మంది వ్యాపారులకు బహుమతులు ఇవ్వాలని సంకల్పించారు.

నీతి అయోగ్‌ ఈ దిశగా చొరవ తీసుకోవడంతో మంచి స్పందన వస్తుందని ఆర్ధిక శాఖ కూడా అంచనా వేస్తోంది. ఒక విధంగా దీని ప్రభావం దేశ ప్రజల స్థితిగతులపై ఉంటుందని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని భారతదేశ వృద్ధిరేటు కూడా బాగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.