Begin typing your search above and press return to search.
మోడీ ప్రత్యేక ప్రేమకు కేటీఆర్ ఫిదా
By: Tupaki Desk | 28 Nov 2017 12:41 PM GMTహైదరాబాదీ ప్రజలు ఎప్పుడెప్పుడా...అని ఎదురుచూస్తున్న మెట్రో కల సాకారమైంది. మియాపూర్ మెట్రో స్టేషన్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు.. హైదరాబాద్ మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోడీ - ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కలిసి మెట్రో పైలాన్ ను ఆవిష్కరించి ప్రారంభించారు. మెట్రో ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మెట్రో యాప్ - బ్రోచర్ ను మోడీ విడుదల చేశారు. ఆ తర్వాత మెట్రో ప్రాజెక్టు ఆడియో విజువల్ ను ప్రధాని వీక్షించారు. అయితే మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చూపిన ప్రత్యేక ప్రేమకు మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు.
మియాపూర్ రైల్వే స్టేషన్ వద్ద మెట్రో రైలు ప్రారంభోత్సవం సందర్భంగా.. అర్బన్ డెవలప్ మెంట్ మినిస్టర్ కేటీఆర్ లేకుండా ప్రధాని మోడీ రిబ్బన్ కట్ చేయలేదు. రెండు మూడు క్షణాల పాటు మోడీ.. కేటీఆర్ కోసం చూశారు. తనకు కుడివైపున ఉన్న కేటీఆర్ ను గుర్తించి.. తన వద్దకు పిలిపించుకుని రిబ్బన్ కట్ చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ నవ్వులు పూశాయి. పలువురిని ఆశ్చర్యంలో పడేసింది కూడా!రిబ్బన్ కటింగ్ అనంతరం మోడీ - గవర్నర్ నరసింహన్ - సీఎం కేసీఆర్ - కేటీఆర్ కలిసి మెట్రో రైలులో ప్రయాణించారు. రైలులో కూడా మోడీ పక్కనే కేటీఆర్ ఉన్నారు.
మెట్రో రైలు ప్రారంభోత్సవం అనంతరం మియాపూర్ స్టేషన్ నుంచి కూకట్ పల్లి స్టేషన్ వరకు ప్రధాని మోడీ మెట్రో రైలులో ప్రయాణించారు. మెట్రోలో ప్రయాణించిన వారిలో గవర్నర్ నరసింహన్ - సీఎం కేసీఆర్ - డిప్యూటీ సీఎం మహముద్ అలీ - మంత్రి కేటీఆర్ - బీజేపీ ఎమ్మెల్యేలు లక్ష్మణ్ - కిషన్ రెడ్డి - మంత్రులు - ఎంపీలు ఉన్నారు. మెట్రో రైళ్లను ప్రధాని మోడీ - సీఎం కేసీఆర్ చిత్రాలతో పాటు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ - బోనాలు - వరంగల్ వెయ్యి స్తంభాల గుడి - రామప్ప - చార్మినార్ - గోల్కొండ వంటి చిత్రాలతో అందంగా ముస్తాబు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీకి గవర్నర్ నరసింహన్ - సీఎం కేసీఆర్ - మంత్రులు - బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడ్నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మియాపూర్ మెట్రో స్టేషన్ కు చేరుకున్నారు.