Begin typing your search above and press return to search.
మోడీ రాముడు..షా లక్ష్మణుడు..యోగి హనుమంతుడు
By: Tupaki Desk | 12 May 2018 3:46 AM GMTరాజకీయ నాయకులకు ఏం వచ్చినా రాకున్నా.. అధినేతల్ని ప్రసన్నం చేసుకునేలా పొగిడేయటంలో వారి ఆర్ట్ అదిరే ఉంటుంది. ఆ విషయంలో మరో మాటకు తావు లేదు. వరుస అత్యాచారాలతో వాతావరణం వేడెక్కిపోయి ఉన్న వేళ.. మోడీ సర్కారుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సమయాన ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒకరు చేసిన పొగడ్తలు ఇప్పుడు మంట పుట్టించటమే కాదు.. పలువురు వేలెత్తి చూపేలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ లోని బైరియా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సురేంద్రసింగ్ తాజాగా నోటికి పని చెప్పారు. ప్రధాని మోడీ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు.. ఉత్తరప్రదేశ్ బీజేపీ సీఎం యోగి అదిత్యనాథ్ పై ఆయన చేసిన వ్యాఖ్యల్ని పలువురు తప్పు పడుతున్నారు. సంచలన పొగడ్తలతో తాజాగా వివాదాన్ని తెర మీదకు తీసుకొచ్చిన ఆయన కొత్త సంప్రదాయానికి తెర తీసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని చెబుతున్నారు.
బీజేపీ ముఖ్యనేతల మీద పొగడ్తల వర్షం కురిపిస్తూనే.. మరోవైపు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం ఆయనకు అలవాటే. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని శూర్పణ పేరుతో పోల్చటం.. ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయటం అప్పట్లో వివాదంగా మారింది.
నాడు తిట్టి వార్తల్లోకి ఎక్కిన సురేంద్రసింగ్.. తాజాగా పొడిగేసి మరీ వార్తల్లోకి వచ్చారు. యుగ అవతార పురుషుడు శ్రీరాముడి పునర్ జన్మగా మోడీని కీర్తించారు. అక్కడితో ఆగని ఆయన.. అమిత్ షాను లక్ష్మణుడిగా పోల్చారు. అంతేనా.. షాకు మరో బిరుదు ఇస్తూ.. ఆయన్ను చాణుక్యుడితో పోల్యేశారు. ఇక.. యూపీ ముఖ్యమంత్రి యోగిని ఆంజనేయస్వామితో పోల్చిన ఆయన.. వీరి ముగ్గురు కాంబినేషన్లో దేశ రాజకీయాల్లో రామరాజ్యాన్ని స్థాపించారంటూ నోటికి పని చెప్పారు. అయినోళ్లను ఇంతలా పొగిడేసిన ఎమ్మెల్యే.. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తే.. దేశ ప్రధాని కావాలన్న రాహుల్ మాటను తీవ్రంగా తప్పు పట్టారు. దేశానికి నాయకత్వం వహించే సత్తా రాహుల్ లో ఏ మాత్రం లేదని సెలవిచ్చారు. ప్రత్యర్థి పార్టీ అధినేతను తిట్టటం తప్పేం కాదు కానీ.. మరీ ఇంత పెద్ద ఎత్తున పొగడటం సైతం సరికాదన్న విషయం ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ కు అర్థమవుతుందంటారా?