Begin typing your search above and press return to search.
అంత వేడిలోనే వారిద్దరూ ఎంతలా నవ్వారంటే..
By: Tupaki Desk | 24 Nov 2016 1:09 PM GMTనోట్ల రద్దు అంశంపై లోక్ సభలో చోటుచేసుకున్న పరిణామాలు చూస్తున్న చాలామందిలో ఒకలాంటి ఉద్రిక్తతకు గురయ్యారు. ఇక.. రాజ్యసభ సమావేశాల్ని లైవ్ చూస్తున్న వారి సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. మోడీ తీసుకున్న రద్దు నిర్ణయాన్ని చీల్చి చెండాడేలా విపక్షాలు విరుచుకుపడుతున్న వైనానికి.. రద్దు నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తున్న చాలామంది భావోద్వేగానికి గురైన పరిస్థితి. చేయక.. చేయక ఇన్నాళ్లకు ఒక ప్రధానమంత్రి సాహసం చేసి.. నల్ల ధనానికి చెక్ పెట్టే చర్య తీసుకుంటే.. దాన్ని దునుమాడేలా విపక్షాలు చేస్తున్న వాదన వింటున్న చాలామందికి ఆగ్రహం వచ్చే పరిస్థితి.
అన్నింటికి మించి మౌన ప్రధానిగా పేరున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం మాట్లాడటం ఆశ్చర్యానికి గురి చేసే అంశం. తన పదేళ్ల పదవీ కాలంలో భారీ ఎత్తున ఆరోపణలు.. విమర్శలు ఎదుర్కొంటున్నా ఎప్పుడూ నోరు విప్పేందుకు ఇష్టపడని ఆయన సైతం మోడీ తీసుకున్న నిర్ణయాన్ని నిరసించారు. పెద్ద నోట్ల రద్దుకు తాను వ్యతిరేకం కాదంటూనే మోడీ నిర్ణయాన్ని తీవ్రస్థాయిలో తప్పు పట్టే ప్రయత్నం చేశారు.
ఒక ఆర్థిక వేత్తగా అందరి మన్ననలు అందుకునే ఆయన సైతం.. తనకున్న ఇమేజ్ కు భిన్నంగా పార్టీ లైన్ లో మాట్లాడిన వైనం మంట పుట్టేలా చేసింది. ఇది సరిపోదన్నట్లుగా సమాజ్ వాదీ.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల అడ్డగోలు వాదనలు విన్న తర్వాత ఇలాంటి నేతలు ఉన్నంత కాలం దేశం బాగు పడదన్న ఫీలింగ్ కలిగే పరిస్థితి. టీవీల్లో లైవ్ లు చూస్తున్న వారికే ఇంతలా ఉంటే.. సభలో.. నేరుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పరిస్థితి మరెంతలా ఉంటుంది.
అయితే.. ఇలాంటి వాటికి తాను చాలా అతీతమన్న భావన కలిగేలా చేయటంలో ప్రధాని మోడీ విజయం సాధించారు. ఒకవైపు పద్దెనిమిది విపక్ష పార్టీలు ఏకతాటి మీద నిలిచి.. ప్రభుత్వ విధానాన్ని తప్పు పట్టటమే ధ్యేయంగా వ్యవహరిస్తున్న వేళ.. ఎలాంటి తోటుపాటు లేకుండా.. ఉద్వేగానికి గురి కాకుండా గంభీరంగా కూర్చున్న ప్రధాని మోడీ.. ఒకదశలో చిరునవ్వులు చిందించారు. ఇంత వేడి వాతావరణంలో ప్రధాని ముఖంలో నవ్వులు విరబూయటం ఆసక్తిని రేకెత్తించింది.
లైవ్ ను ఫాలో అయిన వారికి సంగతి అర్థమైనా.. పెద్దగా ఫాలో కాని వారికి ఏమీ అర్థం కాని పరిస్థితి. ఇంతకూ మోడీ ఎందుకు నవ్వారన్న విషయాన్ని చూస్తే.. రాజ్యసభలో సీరియస్ గా చర్చ సాగుతున్న వేళ.. యూపీకి చెందిన సమాజ్ వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి జైట్లీపై వ్యంగ్యస్త్రాలు సంధించారు. జైట్లీ తనకు బాగా తెలిసిన వారని.. రద్దు విషయం కానీ ఆయనకు ముందే తెలిసి ఉంటే తనకు తప్పనిసరిగా చెప్పేవారన్నారు. యూపీలో బీజేపీకి భయం లేదని.. పాలించేది తమ పార్టీనేని తేల్చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో అప్పటివరకూ గంభీరంగా సభ్యుల మాటల్ని వింటున్న మోడీతో పాటు.. అరుణ్ జైట్లీ సైతం నవ్వేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/