Begin typing your search above and press return to search.

మహాత్ముడి స్మారకం.. రూ.150 నాణెం

By:  Tupaki Desk   |   4 Oct 2019 8:30 AM GMT
మహాత్ముడి స్మారకం.. రూ.150 నాణెం
X
మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ దాని సూచికగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో రూ.150 నాణేలను విడుదల చేశారు. సబర్మతి రివర్ ఫ్రంట్ ఎదుట జరిగిన ‘స్వచ్ఛ భారత్ దివస్’లో మోడీ పాల్గొని ఈ నాణేలను రిలీజ్ చేశారు.

ఇలాంటి నాణేలను ప్రముఖుల జయంతులు, వివిధ ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఆర్బీఐ విడుదల చేస్తుంటుంది. మహాత్ముడి 150వ జయంతి సందర్భంగా ఈ నాణేం విడుదలైంది.

ఇది వరకు సిక్కుమత గురువు, ప్రబోధకుడు అయిన గురుగోవింద్ సింగ్ జయంతి సందర్భంగానూ జనవరిలో ప్రధాని మోడీ 350 రూపాయల స్మారక నాణేన్ని విడుదల చేశారు. ఇక అంతకుముందే 2018లో మాజీ ప్రధాని, దివంగత బీజేపీ కురువృద్ధుడు అటల్ బిహారీ వాజ్ పేయి జ్ఞాపకార్థం మోడీ రూ.100 నాణేం విడుదల చేశారు.

ఇలా ప్రముఖులు, దేశంలో జరిగిన ఘటనలకు సూచికగా భిన్నమైన నాణేల విడుదల జరుగుతుంటుంది. గుజరాత్ లో మోడీ మహాత్ముడికి స్మారకంగా 150 నాణేం విడుదల చేశారు. ఐక్యరాజ్యసమితి కూడా మహాత్ముడిపై పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ సబర్మతి ఆశ్రమంలోని సందర్శకుల పుస్తకంలో ఒక సందేశాన్ని కూడా రాసుకొచ్చాడు. ‘గాంధీజి 150వ జయంతి సందర్భంగా ‘స్వచ్ఛభారత్’కలను నెరవేరుస్తున్నందుకు సంతోషంగా ఉందని.. నేను దీన్ని అదృష్టంగా భావిస్తున్నానని.. భారత్ ను బహిరంగ మల విసర్జన దేశంగా విజయవంతంగా నిలుపుతున్నానని’ అంటూ రాసుకొచ్చాడు.