Begin typing your search above and press return to search.
కేంద్రం కొత్త యాప్..భీమ్
By: Tupaki Desk | 30 Dec 2016 1:52 PM GMTపెద్ద నోట్ల రద్దు అనంతరం డిజిటలైజేషన్ వైపు ప్రజలను మరల్చుతున్న కేంద్ర ప్రభుత్వం ఈ క్రమంలో మరో ముందడుగు వేసింది. ఈ-లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ ఇవాళ భీమ్ యాప్ ను ఆవిష్కరించారు. ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. డిజిధన్ పథకం ద్వారా లావాదేవీలు నిర్వహించిన వాళ్లకు మోదీ బహుమతులు అందజేశారు. డిజిధన్ లక్కీ డ్రా కింద విజేతలుగా నిలిచిన వాళ్లకు చెక్‌లు అందజేశారు. డిజిధన్ పథకం కింద ఈ-లావాదేవీలు నిర్వహించే కస్టమర్లకు వెయ్యి రూపాయల నగదు ఇవ్వనున్న విషయం తెలిసిందే. దాదాపు 100 రోజుల పాటు సుమారు 15 వేల కస్టమర్లకు ఈ లక్కీ డ్రా వర్తించనుంది. కేవలం యూపీఐ - యూఎస్ ఎస్ డీ - ఏఈపీఎస్ - రూపే కార్డులు వినియోగించేవాళ్లు మాత్రం లక్కీ డ్రాకు అర్హులుగా నిలుస్తారు. పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత ప్రధాని మోదీ డిజిధన్ పథకాన్ని ప్రారంభించారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు. డిజిటల్ ఇండియా - డిజిటల్ పేమెంట్ - డిజిధన్ ప్రచారం కార్యక్రమాల ద్వారా భారత్‌ను అభివృద్ధి దేశంగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాణంలో భాగస్వామ్యమైన అంబేద్కర్ గొప్ప ఆర్థికవేత్త అని ప్రధాని అన్నారు. అందుకే భీమ్ రావ్ అంబేద్కర్ పేరిట భీమ్ యాప్‌ను ఆవిష్కరించినట్లు తెలిపారు. అంబేద్కర్ జీవితం అనేక ఆర్థిక సమస్యలపై అవగాహన కల్పిస్తుందన్నారు. ఒకప్పుడు వేలిముద్ర వేసేవాళ్లను చులకనగా చూసేవారు అని, కానీ ఇప్పుడు ఆ వేలిముద్రే మీ బ్యాంకు, మీ గుర్తింపు అని మోదీ పేర్కొన్నారు. భీమ్ యాప్ కు సంబంధించి మరికొన్ని వారాల్లో కీలక ప్రకటన చేయనున్నట్లు మోదీ చెప్పారు. యాప్ సెక్యూర్టీ అంశంపై పకడ్బందీగా వర్క్ చేస్తున్నట్లు చెప్పారు.కేవలం వేలిముద్రతోనే డబ్బును చెల్లించే అవకాశం కల్పించనున్నట్లు ప్రధాని తెలిపారు.భీమ్ యాప్ చదువుకున్న వాళ్లకు కాదని, పేదలకు - రైతులకు - ఆదివాసీలకు చాలా ఉపయోగపడుతుందని ప్రధానమంత్రి తెలిపారు.
డిజిటల్ అనుసంధానం ద్వారా భారత్ భవిష్యత్తులో అద్భుతాలు సాధిస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. పేదల అభ్యున్నతి కోసం అంబేద్కర్ పనిచేశారని, టెక్నాలజీ ద్వారా పేదలను శక్తివంతులుగా మార్చవచ్చు అన్నారు. డిజిటలైజేషన్ ను అడ్డుకునేందుకు కొందరు నిరాశావాదులు అడ్డుపడుతున్నారని, వాళ్ల రుగ్మతకు తన దగ్గర మందులేదన్నారు. సానుకూలవాదులకు మాత్రం తన దగ్గర పరిష్కారం ఉందని ప్రధానమంత్రి అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/