Begin typing your search above and press return to search.
మోడీ ప్రభుత్వం పనితీరుపై ఓటెయ్యాలనుకుంటున్నారా?
By: Tupaki Desk | 26 May 2018 4:51 PM GMTనరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ.. కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇవాళ్టికి నాలుగేళ్లు నిండాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ కొన్ని ట్వీట్స్ చేశారు. 2014 - మే 26వ తేదీన తాము ప్రభుత్వాన్ని చేపట్టామని, లోక్ సభ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అప్పటి నుంచి భారత దేశ స్వరూపాన్ని మార్చేందుకు తమ ప్రభుత్వం అనేక అద్భుత కార్యక్రమాలు చేపట్టిందన్నారు. గత నాలుగేళ్లుగా.. అభివృద్ధి అనేది సామూహిక ఉద్యమంగా మారిందన్నారు. ఇవన్నీ ఇలా ఉంటే...మోడీ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది అందరికీ ఆసక్తిని కలిగించే అంశమే. అలాంటి వారి అభిప్రాయాలు పంచుకునేందుకు తాజాగా ఓ చాన్స్ వచ్చింది.
2014, మే 26న మోడీ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటితో మోడీ ప్రభుత్వం కొలువు దీరి నాలుగేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆసక్తికరమైన వేదిక ఒకటి తెరమీదకు వచ్చింది. ఎన్నికలకు ఇక మిగిలింది ఇంకో ఏడాది మాత్రమే అయిన నేపథ్యంలో నాలుగేళ్లు మోడీ ప్రభుత్వం ఏం చేసింది? గత ప్రభుత్వాలకు, ఇప్పటి బీజేపీ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందా? లేదంటే దొందు దొందేనా. అసలు బీజేపీ ప్రభుత్వం గురించి దేశ ప్రజలు ఏమనుకుంటున్నారు? వచ్చే ఎలక్షన్లలో మళ్లీ బీజేపీ వచ్చేనా? ఇవన్నీ మీడియా సంస్థలకు వచ్చింది. ఇందులో చిత్రమేం లేదు. అయితే,...మీడియా సంస్థలు, సామాన్యులకు వచ్చిన డౌట్లే మన ప్రధాని మోడీకి వచ్చినట్టున్నాయి. అందుకే.. ప్రజల నాడి తెలుసుకోవాలనుకున్నారు. బీజేపీ గురించి, తన ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్నారు. ఇందుకోసం తనకు అచ్చివచ్చిన టెక్నాలజీ బాటలోనే మరో అడుగు వ ఏశారు.
తన ప్రభుత్వం కొలువు తీరి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నమో(నరేంద్ర మోదీ) సర్వే యాప్‌ను మోడీ విడుదల చేశారు. దీన్ని స్మార్ట్‌ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకొని బీజేపీకి రేటింగ్ ఇవ్వాలి. బీజేపీ ప్రభుత్వం పనితీరు, లోకల్ ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరు మీద కూడా రేటింగ్ ఇవ్వొచ్చు. లీడర్ల అందుబాటు - నిజాయితీ - పాపులారిటీ - అణకువ లాంటి అంశాలపై రేటింగ్ ఇవ్వాలి. నమో యాప్ ఇదివరకే మార్కెట్ లోకి వచ్చినప్పటికీ.. నాలుగేళ్ల బీజేపీ ప్రభుత్వం పనితీరుకు రేటింగ్ ఇవ్వడం కోసం కొన్ని ఫీచర్లను యాప్ లో జోడించారు. ఇదివరకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలపై దేశ ప్రజలు ఈ యాప్ ద్వారా ఫీడ్ బ్యాక్ ఇచ్చే అవకాశం ఉండేది. ఇప్పుడు ఏకంగా నాలుగేళ్ల పాలనపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటుండటం ఆసక్తికరంగా మారింది.