Begin typing your search above and press return to search.

ఈ సొరంగం గురించి మీరు తెలుసుకోవాల్సిందే..

By:  Tupaki Desk   |   2 April 2017 3:08 PM GMT
ఈ సొరంగం గురించి మీరు తెలుసుకోవాల్సిందే..
X
ఆదివారం వ‌చ్చిందంటే.. వార్త‌లు త‌క్కువ‌గా ఉంటాయి. పెద్ద‌గా రాజ‌కీయ విశేషాలు.. కార్య‌క్ర‌మాలు ఉండ‌వు. ఒక‌లాంటి నిద్రాణ‌మైన వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంటుంది. అంద‌రూ వీకెండ్ మూడ్‌లో ఉంటారు. రాజ‌కీయంగా ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డాల‌నుకునే వారు సైతం.. త‌మ తిట్టుడు కార్య‌క్ర‌మాన్ని మండేకి పోస్ట్ పోన్ చేసుకుంటారు. కానీ.. అలాంటి ప‌రిస్థితికి ఈ సండే మిన‌హాయింపు అని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చేప‌ట్టిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌.. పెను రాజ‌కీయ దుమారాన్నే రేపుతోంది. బాబుకు అత్యంత క్లోజ్ గా ఉండే మీడియా సైతం.. పార్టీలో చోటు చేసుకున్న నిర‌స‌న‌ల ప‌ర్వాన్ని హైలెట్ చేసి చూపించ‌టం విశేషంగా చెప్పాలి.

రాజ‌కీయంగా హాట్ హాట్ గా ఉన్న వేళ‌.. మిగిలిన వార్త‌లు.. విశేషాలు పెద్ద‌గా దృష్టిని ఆక‌ర్షించ‌వు. కానీ.. ఒక వార్త‌.. జాతీయ‌.. రాష్ట్ర వార్త‌ల‌తో స‌హా.. ప్రతి ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా క‌వ‌ర్ చేసే ప‌రిస్థితి. ఇంత‌కీ ఆ వార్త ఏమిటంటారా? అక్క‌డికే వ‌స్తున్నాం. ప్ర‌ధాని మోడీ.. దేశంలోనే అతి పెద్ద‌దైన సొరంగ మార్గాన్ని జాతికి అంకితం చేశారు. జ‌మ్మూ.. శ్రీన‌గ‌ర్ మ‌ధ్య‌న దూరాన్ని భారీగా త‌గ్గించ‌ట‌మే కాదు.. దాదాపు రెండు గంట‌ల స‌మ‌యాన్ని.. కోట్లాది ప‌ని దినాల్ని.. అంత‌కు మించి వంద‌ల కోట్ల రూపాయిల ఇంధ‌నాన్ని ఆదా చేసే ఈ ట‌న్నెల్ ప్ర‌త్యేక‌త‌లు అన్నిఇన్ని కావు. అందుకే.. ఇంత రాజ‌కీయ వేడిలోనూ.. ప్ర‌తిఒక్క‌రి దృష్టి ఈ ట‌న్నెల్ మీద ప‌డుతోంది. ఇంత‌కీ.. ఈ టన్నెల్ ప్ర‌త్యేక‌త ఏమిటి? అంద‌రిదృష్టి ఎందుకు ప‌డుతుంద‌న్న‌ది చూస్తే..

జ‌మ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని చెనాన్ - న‌ష్రి ప్ర‌ధాన ర‌హ‌దారిలో ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు. దాదాపు తొమ్మిది కిలోమీట‌ర్ల పొడ‌వున ఉన్న ఈ మార్గాన్ని నిర్మించేందుకు ఏకంగా రూ.3702 కోట్లు ఖ‌ర్చు చేశారు. ఈ సొరంగం కార‌ణంగా జ‌మ్ము.. శ్రీన‌గ‌ర్ ల మ‌ధ్య 41 కిలోమీట‌ర్ల దూరం త‌గ్గ‌ట‌మే కాదు.. దాదాపు రెండు గంట‌ల స‌మ‌యం ఆదా కానుంది. అంతేనా.. ఒక్క ఇంధ‌నమే రోజుకు దాదాపు రూ.27ల‌క్ష‌ల మేర ఆదా కానుంది. ఇది దేశంలోనే పొడ‌వైన సొరంగ మార్గ‌మే కాదు.. ఆసియాలోనే అతి పొడ‌వైన రెండు మార్గాల సొరంగంగా దీనికి పేరు సొంతం చేసుకుంది.

సొరంగ‌మార్గంలో మొత్తం మీదా 124 సీసీ కెమేరాలు.. అత్యాధునిక‌ స్కాన‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. వాహ‌న‌దారుల‌కు రోడ్లు క‌నిపించేలా ప్ర‌త్యేక విద్యుత్ దీపాల‌తో పాటు.. ఎలాంటి వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లో అయినా సుర‌క్షితంగా ప్ర‌యాణించే సౌక‌ర్యం ఈ సొరంగంలో ఉంది. అంతేకాదు.. ఈ సొరంగాన్ని నాలుగేళ్ల రికార్డు వ్య‌వ‌ధిలో పూర్తి చేయ‌టం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/