Begin typing your search above and press return to search.
సీఎం జగన్ కు ప్రధాని మోడీ ఫోన్ చేశారెందుకు?
By: Tupaki Desk | 20 April 2020 4:15 AM GMTకలలో కూడా ఊహించని కరోనా కాలంలో ప్రధాని మోడీ వినూత్నంగా వ్యవహరిస్తున్నారు. గతానికి మించిన చురుకుదనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి నెలకొందన్న విషయాన్ని తనకు తానే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో చోటు చేసుకున్న పరిణామాలతో పాటు.. ముఖ్యమంత్రులు తీసుకుంటున్న నిర్ణయాల్ని అడిగి తెలుసుకుంటున్నారు.
తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసిన ప్రధాని మోడీ.. రాష్ట్రంలోని పరిస్థితి గురించి ఆరా తీశారు. కేంద్రం నుంచి అందుతున్న సాయంతో పాటు.. రాష్ట్రంలోని పరిస్థితిపై ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో లేని రీతిలో కొరియా నుంచి తెప్పించిన అధునాత కరోనా కిట్ల గురించి ప్రధాని మోడీకి వివరించిన జగన్.. ఏపీలో కరోనా నిర్దారణ పరీక్షల్ని మరింత ముమ్మరం చేసిన వైనాన్ని చెప్పారు.
కరోనా వైరస్ నివారణకు..కట్టడికి తీసుకుంటున్న చర్యల్నిచెప్పటంతో పాటు..ఈ విషయంలో ఏపీ సర్కారు ఎంత అప్రమత్తంగా ఉన్నది ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ తో మాట్లాడే సందర్భంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రధాని మోడీ అభినందించినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్రానికి ఏమైనా అవసరాలు ఉంటే.. తనకు చెప్పాలని కోరినట్లు సమాచారం.