Begin typing your search above and press return to search.
మోడీ ఫ్లైట్‌కి సాంకేతిక సమస్య
By: Tupaki Desk | 15 April 2015 5:33 AM GMTవిమానాల్లో సాంకేతిక సమస్యలు మామూలే అయినా.. దేశ ప్రధాని ప్రయాణించే విమానంలోనూ సాంకేతిక సమస్య ఉత్పన్నం కావటం గమనార్హం. భారత ప్రధాని నరేంద్రమోడీ తన తాజా విదేశీ పర్యటనలో భాగంగా ఎయిర్ ఇండియావన్ బోయింగ్ విమానంలో వెళ్లిన విషయం తెలిసిందే.
మూడు దేశాల పర్యటనలో భాగంగా వెళ్లిన ఆయన విమానంలో తాజాగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో స్టాండ్ బైగా తయారుగా ఉంచిన ఎయిర్ ఇండియా వన్ మరో విమానాన్ని మంగళవారం తెల్లవారుజామున ముంబయి నుంచి బెర్లిన్‌కు బయలుదేరి వెళ్లింది. ప్రధాని లాంటి కీలకమైన వ్యక్తి ప్రయాణించే విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తటం కాస్త ఆందోళన కలిగించే విషయం.
ప్రధాని లాంటి వ్యక్తి విదేశీ పర్యటనకు ముందు స్టాండ్ బై విమానాన్ని ఒకటి సిద్ధంగా ఉంచుతారు. కానీ.. అలాంటి అవసరం లేకుండా చూస్తారు. కానీ.. అందుకు భిన్నంగా తాజా ఘటన చోటుచేసుకోవటం అధికారిక వర్గాల్లో ఆందోళన కలిగించే అంశం. స్టాండ్‌బైగా వెళ్లిన ఎయిర్ ఇండియా వన్ విమానంలోనే మోడీ తన విదేశీ పర్యటనను పూర్తి చేస్తారు. ఏప్రిల్ 18న ఆయన తిరిగి భారత్‌కు రానున్నారు. స్టాండ్ బై ఫ్లైట్‌కి కూడా సాంకేతిక సమస్యలు రావు కదా..?