Begin typing your search above and press return to search.
ఎడమచేతితో ఇచ్చి కుడి చేతితో తీసుకుంటున్న మోడీ?
By: Tupaki Desk | 7 May 2020 1:30 PM GMTదేశానికి కరోనా విపత్తు వచ్చింది. పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి కోల్పోయారు. జనాలంతా హాహాకారాలు చేస్తున్నారు. భవిష్యత్ పై బెంగ పెట్టుకుంటున్నారు. తమకు ప్యాకేజీ అంటూ మొత్తుకుంటున్నారు. ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన 1.7 లక్షల కోట్ల ప్యాకేజీ అసలు ఎవరికి అందిందో.. ఎటు వెళ్లిందో అంతుబట్టడం లేదు. రేషన్ తోపాటు రూ.500 అకౌంట్లో పడడం తప్పితే పెద్దగా క్షేత్రస్థాయి వినియోగదారుడికి దక్కింది లేదు. పరిశ్రమలు, పత్రికలు, వివిధ పారిశ్రామిక వర్గాలు, మీడియా కరోనాతో కుదేలయ్యామని.. తమను ఆదుకోవాలని అంటున్నా.. మోడీ సర్కార్ నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తోంది.
కేంద్రంలోని మోడీ సర్కార్ పై ప్రజలే కాదు.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దుమ్మెత్తి పోస్తున్నాయి. తాజాగా సీఎం కేసీఆర్.. మోడీ సర్కార్ పై విరుచుకు పడ్డాడు. రోడ్డున పడుతున్నాం ఆదుకోండని విన్నవించినా ఉలుకుపలుకు లేని ఇలాంటి ప్రభుత్వాన్ని తాను ఇంతవరకూ చూడలేదని విమర్శించారు. అన్నింటిని రాష్ట్రాలపై మోపి.. మోడీ కేంద్రం తమాషా చూస్తోందని మండిపడ్డారు.
ఇన్ని విమర్శలు వస్తున్నా ఇప్పటికీ కూడా కేంద్రం తీరు విమర్శల పాలవుతోంది. ఇప్పటికే కరోనా వైరస్ సోకిన వారికి చికిత్సలను అందించడం.. క్వారంటైన్ సెంటర్లను నడపడం.. ఇవన్నీ కూడా రాష్ట్రాలపైనే భారం మోపింది మోడీ సర్కార్. తాజాగా ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ చమురు ధరలు కరోనాతో చరిత్రలోనే కనివీని ఎరుగని స్థాయిలో తగ్గితే తగ్గించాల్సిన మోడీ సర్కార్ ఏకంగా సెస్ లు వేసి ఈ ఏడాదిలో 1.60 లక్షల కోట్లు జనాల సొమ్మును కొల్లగొట్టేందుకు రెడీ అయ్యింది.
ఈ 1.60 లక్షల కోట్ల సొమ్ము ఇటీవల మోడీ సర్కార్ ప్రకటించిన 1.70 లక్షల కోట్ల ప్యాకేజీతో సమానం. అంటే ఎడమచేతితో ఇచ్చి మోడీ కుడి చేతితో తీసుకుంటున్నాడన్న మాట..
ఇప్పటికే మోడీ తీరు వివాదాస్పదమవుతోంది. కేవలం వీడియోలు రిలీజ్ చేయడం.. రాష్ట్రాలకు సూచన చేయడం.. సలహాలు ఇవ్వడం.. లాక్ డౌన్ ప్రకటనలు చేయడం తప్ప.. ఆర్థికంగా కేంద్రం రాష్ట్రాల భారాన్ని పంచుకుంటున్న దాఖలాలు పెద్దగా కనిపించడం లేదు. ఇప్పుడు పెట్రోల్ రేటు భారీగా పడిపోయినా సెస్ పేరుతో తగ్గించకుండా మోడీ సర్కార్ కోట్లు కొల్లగొడుతున్న తీరు విమర్శల పాలవుతోంది. ఇంతటి కరోనా వేళ ఏంటి దోపిడీ మోడీజీ అంటూ అందరూ దుయ్యబడుతున్నారు.