Begin typing your search above and press return to search.

మోడీ దెబ్బకు పాకిస్తాన్ కి చెడ్డీ తడిచినట్లే!

By:  Tupaki Desk   |   23 Sep 2019 7:22 AM GMT
మోడీ దెబ్బకు పాకిస్తాన్ కి చెడ్డీ తడిచినట్లే!
X
వారం పాటు సాగనున్న తన అమెరికా పర్యటనలో మోడీ తన లక్ష్యాన్ని స్పష్టం చేశారు. హోస్టన్ ర్యాలీలో యాభై వేలకు పైగా హాజరైన స్టేడియంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమక్షంలో దాయాది పాకిస్థాన్ మీద ఆయన చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. తన ఎజెండా ఏమిటన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు.

ప్రవాస భారతీయుల సాక్షిగా పాక్ మీద విరుచుకుపడటం.. అది కూడా ట్రంప్ సమక్షంలోనే కావటం ఒక విశేషంగా చెప్పాలి. దేశంలోని ఉగ్రవాద చర్యలకు.. సెప్టెంబరు 11న అమెరికాలో జరిగిన ఉగ్రదాడులకు కారణం ఒక్కరేనన్న విషయం చెప్పటం ద్వారా.. పాక్ ఉమ్మడి శత్రువన్న విషయాన్ని స్పష్టం చేశారని చెప్పాలి.

తాము తాజాగా చేసిన ఆర్టికల్ 370లో మార్పులపై పాక్ దుయ్యబట్టిన తీరును ఘాటుగానే దుయ్యబట్టారు. సొంత దేశాన్ని చక్కడిద్దుకోలేని వారు.. భారత్ లో 370 అధికరణం ఉపసంహరణ ఇబ్బందిగా ఉందనటం ఏమిటంటూ తప్పు పట్టారు. ఉగ్రవాదంపై ట్రంప్ మద్దతుగా నిలిచారని చెప్పటం ద్వారా.. అమెరికా అధ్యక్షుడి దన్ను భారత్ కే ఉందన్న విషయాన్ని స్పష్టం చేయటంతో పాటు.. దాయాది చెడ్డి తడిచేలా మోడీ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పాలి.

ఆర్టికల్ 370ను వెనక్కి తీసుకోవాలని భారత పార్లమెంటు మూడింట రెండొంతుల మెజార్టీతో ఆమోదం తెలిపిన తీరుపై భారత పార్లమెంటేరియన్లకు లేచి నిలబడి కరళాళ ధ్వనులతో అభినందనలు చెప్పాలనటం ద్వారా తాము తీసుకున్న నిర్ణయానికి ప్రవాస భారతీయులు ఎంత భారీగా మద్దతు పలుకుతున్నారన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. ఉగ్రవాదంతో పాటు.. పాక్ దుర్మార్గాన్ని దుయ్యబట్టేసిన మోడీ.. ట్రంప్ మద్దతు భారత్ కే ఉందన్న విషయాన్ని ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పటంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఈ తీరులో మోడీ వ్యూహం ఉంటుందని అంచనా వేయలేని పాక్ కు.. హోస్టన్ సభ వెన్నులో చలి పుట్టించటం ఖాయమని చెప్పక తప్పదు.