Begin typing your search above and press return to search.
18వ ఏట హిమాలయాలకు మోడీ.. అక్కడేం చేశాడంటే?
By: Tupaki Desk | 13 Aug 2019 5:55 AM GMTభారత ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు దేశంలోనే శక్తివంతమైన నేత. మరి అంతకుముందు ఏంటి.? గుజరాత్ ముఖ్యమంత్రి. దానికి ముందేంటి.? బీజేపీ కార్యకర్త, నాయకుడు.. దానికి ముందు ఆర్ ఎస్ ఎస్ లో ఓ సైనికుడు. వీటన్నింటికంటే ముందు మోడీ ఎవరు? ఎక్కడ ఉండేవారు? ఏం చేసేవారు.? అంటే కొంచెం కష్టమే.. కానీ ఈ విషయాలను తాజాగా మోడీ పంచుకున్నారు..
ప్రముఖ డిస్కవరీ చానెల్ లో మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంలో భాగంగా సాహసికుడు బేర్ గ్రిల్స్ తో కలిసి ఉత్తరాఖండ్ లోని ‘జిమ్ కార్బెట్’ జాతీయ అభయారణ్యంలో మోడీ విహారం చేసిన సంగతి తెలిసిందే. ఆ షో సోమవారం ప్రసారమైంది. ఈ సందర్భంగా మోడీ తన అంతరంగాన్ని ఆవిష్కరించాడు..
బేర్ గ్రిల్స్ తో ప్రధాని మోడీ తన బాల్యాపు విశేషాలను పంచుకున్నాడు. 18వ ఏటనే తాను ఇళ్లు విడిచి హిమాలయాలకు వెళ్లిపోయానని మోడీ చెప్పుకొచ్చాడు. ఆధ్యాత్మిక జీవనాన్ని గడపాలనే ఇలా చేసినట్టు తెలిపాడు. అనంతరం అక్కడి ప్రజలతో మమేకమై వారి నుంచి చాలా నేర్చుకొని ఏదో ఒకటి సాధించాలని భావించి తిరిగి తన సొంతూరు గుజరాత్ కు వచ్చినట్టు తెలిపారు. అయితే మోడీ యశోదా బెన్ ను వివాహం చేసుకున్నాక పారిపోయాడా.? అంతకుముందా అన్నది మాత్రం వెల్లడించలేదు.
తనకు చిన్నప్పుడు స్కూలుకు వెళ్లడానికి ఇస్త్రీ చేసిన బట్టలు లేకపోతే వేడి అన్న గిన్నెతో చేసుకునేవాడినని.. ఇంట్లో డబ్బులు లేక చాయ్ దుకాణాన్ని నడిపానని వివరించాడు. ప్రతీరోజు స్నానం చెరువు దగ్గరే చేసేవాడినని మోడీ కష్టాలను వివరించాడు. ఇంట్లో వీలులేకుండా ఉండేదన్నారు. ఆ చెరువులో ముసలి పిల్ల దొరికితే తీసుకొచ్చి అమ్మకిస్తే తిట్టిందని మోడీ తెలిపాడు. తల్లిని పిల్లను వేరు చేయకూడదని.. తన తల్లి చెబితే చివరకు చెరువులోనే వదిలేశానని వివరించాడు. ప్రకృతిని ప్రేమిస్తే అది మనకు సహకరిస్తుందని.. ప్రకృతికి వ్యతిరేకంగా వెళితేనే అది ప్రమాదమని మోడీ స్పష్టం చేశారు.