Begin typing your search above and press return to search.

మోడీ యోగా స్కిప్ చేస్తే వాళ్లమ్మకు పండగే

By:  Tupaki Desk   |   10 Jan 2017 8:33 AM GMT
మోడీ యోగా స్కిప్ చేస్తే వాళ్లమ్మకు పండగే
X
తన కొడుకు బుద్ధిగా యోగా చేస్తే ఏ తల్లి అయినా సంతోషిస్తుంది కానీ.. యోగా స్కిప్ చేసినందుకు పండగ ఎందుకు అవుతుందన్న డౌట్ అక్కర్లేదు. ఎందుకంటే.. యోగాను స్కిప్ చేసిన మోడీ.. ఆ సమయాన్ని తన తల్లి కోసం కేటాయించారు మరి. దేశంలో అత్యున్నత పదవిలో ఉన్న కొడుకు క్షణం తీరిక లేకుండా ఎంత బిజీ బిజీగా ఉంటారో తెలిసిందే. అలాంటి ఆయన.. తన తల్లిని కలిసేందుకు వీలుగా ఈ రోజు యోగాను స్కిప్ చేశారు ప్రధాని మోడీ. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్వీట్ లో పేర్కొన్నారు.

ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు గుజరాత్ లో గడపనున్న ప్రధాని మోడీ.. గాంధీ నగర్ లో నిర్వహిస్తున్న వైబ్రెంట్ గుజరాత్ సదస్సు ను ప్రారంభించనున్నారు. ఈ భారీ సదస్సుకు దాదాపు 500 మంది కంపెనీ సీఈవోలు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గుజరాత్ వచ్చిన మోడీ.. ఈ రోజు గాంధీనగర్ లోని తన సోదరుడి ఇంట్లో ఉంటున్న తల్లి హీరాబెన్ ను కలిశారు.

కుటుంబ సభ్యులతో గడిపిన ఆయన.. తల్లితో కలిపి టిఫిన్ చేశారు. తల్లితో కాసేపు గడపటంపై మోడీ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. డిసెంబరులో గుజరాత్ కు వచ్చిన ఆయన పార్టీ సమావేశాల్లో పాల్గొని అనంతరం తల్లిని కలిసిన ఆయన.. మళ్లీ ఈ రోజు తల్లిని కలిశారు. ఎప్పుడో ఒకసారి కలిసే అవకాశం వచ్చినప్పుడు.. రోజూ చేసే యోగా ఒక్కరోజు స్కిప్ చేస్తే మాత్రం నష్టమేంది?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/