Begin typing your search above and press return to search.

మోదీ మాట‌!.. ఉగ్ర‌దాడి యూపీఏ అస‌మ‌ర్థ‌తే!

By:  Tupaki Desk   |   11 Sep 2017 1:42 PM GMT
మోదీ మాట‌!.. ఉగ్ర‌దాడి యూపీఏ అస‌మ‌ర్థ‌తే!
X
దేశంలో ప్ర‌ధాన విప‌క్షం కాంగ్రెస్‌ ను టార్గెట్ చేయ‌డంలో ముందున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మ‌రోసారి రెచ్చిపోయారు. ఎప్ప‌క‌ప్పుడు ఆయ‌న కాంగ్రెస్‌ను ఇర‌కాటంలో నెడుతూనే ఉన్నారు. తాజాగా 1993లో మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలో జ‌ర‌గిన ఉగ్ర‌దాడి మ‌న అస‌మ‌ర్థ‌తే అంటూ ప‌రోక్షంగా కాంగ్రెస్‌ పై విరుచుకు ప‌డ్డారు. ఉగ్ర‌దాడుల‌ను ప‌సిగ‌ట్ట‌డంలో అప్ప‌టి ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని ఆరోపించారు. అమెరికాలోని చికాగో న‌గ‌రంలో 124 ఏళ్ల కింద‌ట నిర్వ‌హించిన‌ స‌ర్వ‌మత స‌భ‌ల్లో పాల్గొన్న స్వామి వివేకానందుడు.. ప్ర‌పంచ ప్ర‌జానీకాన్ని ఉద్దేశించి స్ఫూర్తి దాయ‌క ప్ర‌సంగం చేశారు. ఈ ప్ర‌సంగానికి 125 సంవ‌త్సాలు వ‌చ్చాయి. దీనిని పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ వివేక స్ఫూర్తి పేరుతో జాతినుద్దేశించి ప్ర‌సంగించారు.

ఈ సంద‌ర్భంగా ప‌రోక్షంగా కాంగ్రెస్‌ ను టార్గెట్ చేసిన ఆయ‌న‌ పాల‌కుల వైఫ‌ల్యం కార‌ణంగా.. ముంబై దాడి ఘ‌ట‌న‌లో 257 మందిని ఉగ్ర‌మూక‌లు పొట్ట‌న పెట్టుకున్నాయ‌ని తీవ్ర‌స్థాయిలో దుయ్య‌బ‌ట్టారు. అదేవిధంగా వంద‌ల మంది విక‌లాంగులుగా మిగిలార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రెండు రోజుల కింద‌టే ఈ పేలుళ్ల కేసుకు సంబంధించి ప్ర‌త్యేక సీబీఐ కోర్టు దోషుల‌కు శిక్ష విధించిన నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ కాంగ్రెస్‌ను టార్గెట్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఈ ప్ర‌సంగంలోనే 1893లో వివేకానందుడు చికాగోలో అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించారని గుర్తు చేశారు.

'యంగ్ ఇండియా - న్యూ ఇండియా' నినాదంతో ముందుకు సాగాలని మోదీ పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద ఆలోచనల నుంచి స్ఫూర్తి పొంది కలలను సాకారం చేసుకునే దిశగా యువత ముందడుగు వేయాలని కోరారు. ఈ జాతి మొత్తం వివేకానందుని ప్ర‌సంగాల నుంచి స్ఫూర్తి పొందాల‌ని కోరారు. అనంత‌రం దీన్ దయాళ్ ఉపాధ్యాయ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. మొత్తానికి విష‌యం ఏదైనా.. సంద‌ర్భం ఎలాంటిదైనా.. కాంగ్రెస్‌ను టార్గెట్ చేయ‌డ‌మే మోదీ ల‌క్ష్యంగా మారింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.