Begin typing your search above and press return to search.
హైదరాబాద్ గురించి కొత్త మాట చెప్పిన మోడీ
By: Tupaki Desk | 19 Feb 2018 12:36 PM GMTతెలంగాణ ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకేసారి తీపి - చేదు కబుర్లు అందించారు. కీలకమైన ప్రతిష్టాత్మక సదస్సుకు హాజరు కావాల్సిన ప్రధాని ఇందుకు గైర్హాజరయ్యారు. అయితే, తెలంగాణ సర్కారుకు తీపికబురు అందించారు. ప్రపంచ ప్రతిష్టాత్మక ప్రపంచ ఐటీ కాంగ్రెస్ హైదరాబాద్ వేదికగా సోమవారం ప్రారంభమయింది. వాస్తవానికి ఈ సదస్సుకు మోడీ హాజరుకావాల్సి ఉంది. అయితే, ఆయన గైర్హాజరు అయ్యారు. కాగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా హైదరాబాదీలు ఖుష్ అయ్యే మాట చెప్పారు.
హైటెక్స్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఐటీ కాంగ్రెస్ ను ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. `భారత్ లో ప్రపంచ ఐటీ కాంగ్రెస్ జరగడం ఇదే ప్రథమం.. ఈ సదస్సును ప్రారంభించడం సంతోషంగా ఉంది. సదస్సుకు వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు భారత్ - హైదరాబాద్ ఆహ్వానం పలుకుతోంది` అని అన్నారు. డిజిటల్ సాంకేతికత ఆవిర్భావానికి భారత్ ప్రధాన కేంద్రమని మోడీ చెప్పారు. డిజిటల్ ఇండియా దిశగా తమ ప్రయాణం కొనసాగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. లక్ష గ్రామాలను ఆప్టికల్ ఫైబర్ తో అనుసంధానించామని ఆయన వెల్లడించారు. డిజిటల్ ఇండియా దిశగా కొనసాగుతోన్న మా ప్రయాణం.. కేవలం ప్రభుత్వంతోనే సాధ్యమయ్యే పని కాదన్నారు. ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమన్నారు. 320 మిలియన్ల జన్ ధన్ ఖాతాల ద్వారా రూ. 57 వేల కోట్లు ప్రభుత్వానికి ఆదా అయిందని గుర్తు చేశారు. 470 వ్యవసాయ మార్కెట్లను ఈనామ్ కు అనుసంధానించామని తెలిపారు. దేశంలో 60 మిలియన్ల మందిని డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని మోడీ పేర్కొన్నారు. డిజిటల్ లావాదేవీల ద్వారా ప్రభుత్వానికి చాలా నిధులు మిగులుతున్నాయని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
కాగా, ఈ సదస్సుకు వచ్చిన అతిథులు అద్భుతమైన హైదరాబాద్ ఆతిథ్యాన్ని ఆస్వాదించాలని ప్రధాని కోరారు. హైదరాబాద్‌లోని దర్శనియ ప్రదేశాలను సందర్శించాలని కోరారు. దీంతోపాటుగా దేశంలోని ఇతర ప్రాంతాలను కూడా సందర్శించాలని ఆయన సూచించారు. తాను ఈ సమావేశానికి రావాల్సి ఉన్నప్పటికీ...రాలేకపోయానని తెలిపారు. కానీ ఇలా టెక్నాలజీ సహాయంతో ప్రసంగించడం సంతోషంగా ఉందన్నారు.
ఈ సదస్సు నేటి నుంచి మూడు రోజుల పాటు కొనసాగనుంది. నాస్కామ్ - రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సులో సీఎం కేసీఆర్ - కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ - ఐటీ మినిస్టర్ కేటీఆర్ - వివిధ దేశాల ఐటీ మంత్రులు - ఐటీ దిగ్గజాలు - 89 దేశాలకు చెందిన 2500 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. సదస్సును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో కేంద్రమంత్రి రవి శంకర్ ప్రసాద్ పాల్గొననున్నారు. ఫైబర్ గ్రిడ్ ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం.. ప్రపంచానికి పరిచయం చేసింది. హైటెక్స్ నుంచి పైలట్ ప్రాజెక్టును కేటీఆర్ వివరించారు.