Begin typing your search above and press return to search.

రేపు సీఎంలతో మోడీ మీటింగ్.. మళ్లీ లాక్ డౌనా?

By:  Tupaki Desk   |   26 July 2020 12:10 PM GMT
రేపు సీఎంలతో మోడీ మీటింగ్.. మళ్లీ లాక్ డౌనా?
X
ప్రధాని నరేంద్రమోడీ సీఎంలతో మీటింగ్ పెడుతున్నారంటే ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారని అర్థం. లాక్ డౌన్, అన్ లాక్ అప్పుడు కూడా మోడీ ఇలానే సీఎంలతో మీటింగ్ పెట్టి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకున్నారు.ఈ క్రమంలోనే రేపు మళ్లీ ప్రధాని నరేంద్రమోడీ సీఎంలతో వర్చువల్ మీటింగ్ కు సిద్ధమయ్యారు. దీంతో ఈసారి ఏం నిర్ణయించబోతున్నారనే ఉత్కంఠ అందరిలోకి నెలకొంది.

ప్రస్తుతం దేశంలో కరోనా జెట్ స్పీడుతో వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా కేసులు విస్తృతంగా వ్యాపిస్తూ 13 లక్షలు దాటాయి. ప్రతీరోజు 50వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. సెప్టెంబరు కల్లా ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానానికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే కేసులు పెరిగితే ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందక అల్లకల్లోలం ఖాయం. అందుకే ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే దానిపై ప్రధాని మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. ఈ నెలాఖరుతో అన్ 2.0 ముగియనుండడంతో మోడీ 3.0లో ఏం చేయబోతున్నారు..? ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడకుండా కరోనాను కంట్రోల్ చేయడంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది.

సెప్టెంబర్ నాటికి రోజుకు లక్ష కేసులు నమోదై ఆరోగ్య రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉండడంతో దేశంలో ఐసీయూ పడకలు.. వెంటిలేటర్ల కొరత తీవ్రమవుతుంది. ఈ నేపథ్యంలోనే లాక్ డౌన్ విధిస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో కుదుటపడుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊపరిలూదే నిర్ణయాలు తీసుకుంటారనే ఆశలు రేకెత్తుతున్నాయి. మోడీ రేపు సీఎంలతో మీటింగ్ తర్వాత ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది.