Begin typing your search above and press return to search.
అతిపెద్ద శివుడి విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించారు
By: Tupaki Desk | 25 Feb 2017 4:31 AM GMT112 అడుగుల ఎత్తైన ఆదియోగి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆవిష్కరించారు. సద్గురు జగ్గీ వాసుదేవ్ సారథ్యంలోని ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తమిళనాడులోని కోయంబత్తూరు వెల్లియంగిరి కొండల సమీపంలో దేశంలోనే అతిపెద్ద పరమశివుడి విగ్రహం ఏర్పాటైంది. సద్గురు యోగి జగ్గి వాసుదేవ్ తో కలిసి ప్రధాని ఆదియోగి విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహా శివరాత్రి పర్వదినానా ఆదియోగి విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టమని ప్రధాని మోడీ అన్నారు. భిన్నత్వం మన దేశం ప్రత్యేకత అని పేర్కొంటూ అదే మనకు గర్వకారణమని అన్నారు. ప్రపంచమంతా శివమయమేనని తెలిపారు. ఆదియోగి విగ్రహాన్ని చూస్తుంటే హృదయం ఉప్పొంగుతోందని ప్రధానమంత్రి అన్నారు.
ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దేందుకు 8 నెలల సమయం పట్టిందని వాసుదేవ్ చెప్పారు. 112 ధ్యానముక్తి మార్గాలకు సూచికగా 112 అడుగుల ఎత్తైన విగ్రహన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ విద్యాసాగరరావు, సీఎం పళనిస్వామి, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, గవర్నర్ కిరణ్ బేడీ, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. ఈశా ఫౌండేషన్ దేశంలో నాలుగు దిక్కుల్లో విగ్రహాలు ఏర్పాటు చేసే యోచన చేస్తున్నట్లు సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/