Begin typing your search above and press return to search.
దేశానికి మరో పిలుపునిచ్చిన మోడీ
By: Tupaki Desk | 3 April 2020 4:16 AM GMTదేశంలో లాక్ డౌన్ ప్రకటించిన మోడీ తాజాగా శుక్రవారం మళ్లీ దేశ ప్రజల ముందుకు వచ్చారు. ప్రజలకు దిశానిర్ధేశం చేశారు. కరోనాపై యుద్ధంలో భారతీయులు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. భారతీయులంతా ఏకమై కరోనాను తరిమికొడతారని ప్రధాని మోడీ అన్నారు.
లాక్ డౌన్ తో మేము ఒక్కరమే ఇంట్లో ఉంటే ఏం సాధిస్తామని ప్రజలు అనుకుంటున్నారని.. కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంట్లే కరోనాను జయించినట్టే అని ప్రధాని మోడీ అన్నారు.
జనతా కర్ఫ్యూ ద్వారా భారతీయులు తమ శక్తి సామర్థ్యాలు చాటారని ప్రధాని మోడీ ప్రశంసించారు. భారత దేశంలో కరోనాపై యుద్ధంలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోదన్నారు. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు మన బాటలోనే నడుస్తున్నాయన్నారు.
ఇక నుంచి లాక్ డౌన్ ను మరింత కఠినంగా పాటించాలని.. ఈ ఆదివారం దేశ ప్రజలంతా కరోనాను తిప్పికొట్టే సంకల్పం తీసుకోవాలని ప్రధాని మోడీ కోరారు..
ఈ సందర్భంగా ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు బంద్ చేసి కొవ్వొత్తులు, దివ్వెలు వెలిగించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. 130 కోట్ల మంది ఈ సమయాన్ని నాకు ఇవ్వాలని కోరుతున్నానన్నారు. సంకట సమయంలో ఇది భారతీయులకు శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. కరోనా పై పోరాడుతున్న అందరికీ ధన్యవాదాలని మోడీ వీడియో సందేశంలో అన్నారు.