Begin typing your search above and press return to search.

టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్.. మోడీ

By:  Tupaki Desk   |   5 Dec 2016 7:26 AM GMT
టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్.. మోడీ
X
మోడీ పాపులారిటీ విశ్వవ్యాప్తమవుతోంది. ఇప్పుడాయన ప్రపంచంలో అత్యంత ప్రతష్ట కలిగిన వ్యక్తిగా నిలిచారు.. అవును.. టైమ్స్‌ మ్యాగజీన్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎంపికయ్యారు. ఆన్‌ లైన్‌ రీడర్స్‌ పోల్‌ లో మోడీ అందరినీ దాటుకుని మొదటి స్థానంలో నిలిచారు. వివిధ దేశాల అధ్యక్షులు.. ఇతర రంగాల ప్రముఖులందరినీ తోసిరాజని మోడీ ఈ టాప్ పొజిషన్ దక్కించుకున్నారు. దీనిపై ప్రఖ్యాత టైమ్ మ్యాగజీన్ కొద్దిసేపటి కిందటే అధికారికంగా ధ్రువీకరించింది.

ప్రఖ్యాత టైమ్ మ్యాగజీన్ తన పాఠకులతో ఏటా ఆన్ లైన్ పోల్ నిర్వహించి పర్సన్ ఆఫ్ ది ఇయర్ ను ఎంపికచేస్తోంది. ఆదివారంతో ముగిసిన ఈ పోలింగులో 18 శాతం ఓట్లతో మోడీ టాప్ లో నిలిచారు. మొదటి నుంచి ఆధిపత్యం సాధించిన మోడీ చివరి వరకు కూడా మిగతా పోటీదారులకు అందనంత ఎత్తులో నిలిచారు. అమెరికా పాత - కొత్త అధ్యక్షులు ఒబామా - ట్రంపులను... హిల్లరీ క్లింటన్ ను - మార్క్ జుకర్ బర్గ్ ను ఇలా అందరినీ వెనక్కు నెట్టేసి పర్సన్ ఆఫ్ ది ఇయర్ అయ్యారు.

కాగా మోడీ ఒక్కరికే 18 శాతం ఓట్లు రాగా ఒబామా - ట్రంప్ - వికీలీక్స్ అధినేత జూలియస్ అసాంజేలకు కలిపి 7 శాతం ఓట్లే వచ్చాయి. హిల్లరీ క్లింటన్ కు 4 శాతం ఓట్లు వచ్చాయి. ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గుకు కేవలం 2 శాతం ఓట్లే వచ్చాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/