Begin typing your search above and press return to search.

క‌విత బ‌ర్త్ డేకు మోడీ స‌ర్ ప్రైజ్ గిఫ్ట్‌!

By:  Tupaki Desk   |   14 March 2018 5:10 AM GMT
క‌విత బ‌ర్త్ డేకు మోడీ స‌ర్ ప్రైజ్ గిఫ్ట్‌!
X
ఊహించిన‌ట్లుగా చేస్తే ఆయ‌న మోడీ ఎందుకు అవుతారు. త‌న‌ను తప్పు ప‌ట్టే వారి విష‌యంలోనూ మోడీ మ‌నసు దోచుకునేలా చేస్తారు. అవ‌స‌ర‌మైన‌ప్పుడు స్పందించేందుకు ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌ని ఆయ‌న‌.. మ‌రికొన్ని విష‌యాల్లో మాత్రం చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. కోట్లాది మంది స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి.. ప్రాజెక్టుల కోసం.. ప‌నుల కోసం ప్ర‌ధానిని క‌లిసేందుకు టైం అడిగితే ఇవ్వ‌రు.

కానీ.. అదే నేత పుట్టిన‌రోజును మాత్రం గుర్తు పెట్టుకొని మ‌రీ వెరైటీగా విషెస్ చెప్ప‌టం మోడీకి మాత్ర‌మే చెల్లుతుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె..ఎంపీ క‌విత పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మోడీ త‌న‌దైన రీతిలో విషెస్ చెప్పి ఆశ్చ‌ర్యానికి గురి చేశారు.

స్వ‌ప‌క్షం.. విప‌క్షం అన్న తేడా లేకుండా ముఖ్య‌మైన అధినేత‌లంద‌రికి బ‌ర్త్ డే విషెస్ చెప్ప‌టంలో మోడీ త‌న మార్క్ ను ప్ర‌ద‌ర్శించారు. తాను తీవ్రంగా వ్య‌తిరేకించే సోనియా.. రాహుల్ గాంధీల పుట్టిన‌రోజున మాత్రం ట్విట్ట‌ర్ లో ట్వీట్ విషెస్ చెప్ప‌టం అల‌వాటు. ఇక‌.. తెలుగు చంద్రుళ్ల పుట్టిన రోజు సంద‌ర్భంగా ఫోన్ చేసి మ‌రీ విషెస్ చెబుతారు.

తాజాగా థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశ‌గా కేసీఆర్ ప్ర‌య‌త్నాలు షురూ చేయ‌ట‌మే కాదు.. ప్ర‌ధాని మోడీ తీరును తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్న వేళ‌.. ఆయ‌న కుమార్తె క‌మ్ ఎంపీ క‌విత పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకొని ప్ర‌త్యేకంగా తెలుగులో శుభాకాంక్ష‌ల లేఖ‌ను ఆమెకు పంపారు.

మీ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా నా హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు. స్వీక‌రించండి. దేశ ప్ర‌జ‌ల‌కు మీరు సేవ‌లు అందించేందుకు వీలుగా కావాల్సిన ఆరోగ్య‌క‌ర‌.. ఆనంద‌మ‌య జీవితాన్ని ప్ర‌సాదించాల‌ని భ‌గ‌వంతుడ్ని కోరుతున్నాన‌ని లేఖ‌లో పేర్కొన్నారు. ఆయురారోగ్యాల‌తో నిండు నూరేళ్లు ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించాల‌ని భ‌గ‌వంతుడ్ని కోరుకుంటున్న‌ట్లు లేఖ‌లో క‌విత‌కు శుభాకాంక్ష‌లు చెప్పారు. ఓప‌క్క త‌న‌పై క‌త్తులు దూస్తే.. కొత్త కూట‌మి ఆలోచ‌న‌లు చేస్తున్న ఒక రాష్ట్రాధినేత కుమార్తె పుట్టిన రోజుకు కాస్త భిన్నంగా లేఖ రాయ‌టం.. అది కూడా స‌ద‌రు నేత మాతృభాష‌లో ఉండ‌టం చూస్తే.. లేఖ ఎలా ఉండాల‌న్న దానిపై మోడీ సూచ‌న‌లు చేసిన‌ట్లు స్ప‌స్ట‌మ‌వుతున్న‌ట్లు చెప్ప‌క త‌ప్ప‌దు. ఏమైనా.. క‌విత‌కు లేఖ‌తో శుభాకాంక్ష‌లు చెప్ప‌టం ద్వారా.. త‌న‌పై క‌త్తి దూసుకున్న అధినేత విష‌యంలో మోడీ మార్క్ ను ప్ర‌ద‌ర్శించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.