Begin typing your search above and press return to search.

రూటు మార్చిన మోడీ..పాక్ పైనుంచే నోవే..

By:  Tupaki Desk   |   12 Jun 2019 10:49 AM GMT
రూటు మార్చిన మోడీ..పాక్ పైనుంచే నోవే..
X
జూన్ 13, 14వ తేదీల్లో కిర్గిజిస్తాన్ లోని బిష్కెక్ లో జరిగే షాంఘై సహకార సదస్సు(ఎస్ సీ వో)కు హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్రమోడీ వెళ్లనున్నారు. అయితే ఇక్కడే చిక్కొచ్చి పడింది. కిర్గిజిస్తాన్ దేశం పాకిస్తాన్ కు ఉత్తరాన ఉన్న దేశం. ఇప్పటికే పాక్ తో మొన్నటి వరకు యుద్ధమేఘాలు కమ్ము కోవడంతో ఆ దేశం భూభాగం నుంచి వెళ్లడానికి మనకు అనుమతులు లేవు. అందుకే మోడీ విమానానికి గగనతల అనుమతులు ఇవ్వాలన్న భారత్ విజ్ఞప్తికి పాకిస్తాన్ రెండు రోజుల క్రితం స్పందించింది. తమ దేశం మీదుగా మోడీ విమానంలో వెళ్లడానికి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంగీకరించినట్టు సమాచారం.

అయితే ఇక్కడే ట్విస్ట్ నెలకొంది. భారత ప్రధాని భద్రత దృష్ట్యా భారత వైమానిక దళం రెండు రూట్లను సిద్ధం చేసింది. ఒకటి పాకిస్తాన్ మీదుగా.. రెండోది ఓమన్, ఇరాన్, సెంట్రల్ ఏిషియా దేశాల గుండా వెళ్లడం.. పాకిస్తాన్ పై భారత ప్రధాని వెళితే ఒకవేళ ఏదైనా అనుకోని ఉపద్రవం జరిగే ప్రమాదాలు ఎక్కువ. అందుకే భారత్ వాయుసేన గల్ఫ్ దేశాల మీదుగా కిర్గిజిస్తాన్ మోడీ వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తోంది.

పాకిస్తాన్ లోని బాలకోట్ పై ఈ ఏడాది ఫిబ్రవరిలో మోడీ వైమానిక దాడులు చేయించారు. దీంతో పాకిస్తాన్ దేశం భారత నుంచి వెళ్లే విమానాల రూట్లను బ్లాక్ చేసింది. 11 రూట్లకు గాను రెండు మార్గాల్లోనే వెళ్లడానికి అనుమతులు ఇస్తోంది. దీంతో భారత అధికారులు పాకిస్తాన్ అధికారులను కోరారు. మోడీ వెళ్లడానికి అనుమతులు ఇవ్వాలని కోరగా.. పాకిస్తాన్ ఇచ్చింది.

అయితే భద్రతా కారణాల వల్లే పాకిస్తాన్ మీదుగా మోడీ వెళ్లడానికి అధికారులు నో చెప్పారు. ఇక కిర్గిజిస్తాన్ లో సదస్సుకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ కూడా హాజరుకాబోతున్నారు.